పీఎంఎస్ సమస్య ఎలాంటి వారికి వస్తుంది..?
సాక్షి లైఫ్ : గతంలో 30ఏళ్ల వయస్సు దాటాకే పీఎంఎస్ సమస్య వచ్చేది..ప్రస్తుతం నలుగురిలో ముగ్గురికి ప్రీమెన్ స్ట్రువల్ సిండ్రోమ్.. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కారణంగానే ఈ సమస్య వస్తుందంటున్న గైనకాలజిస్టులు.. పీఎంఎస్ సమస్య ఎలాంటి మహిళల్లో వస్తుంది..? ప్రస్తుతం నలుగురిలో ముగ్గురికి ప్రీమెన్ స్ట్రువల్ సిండ్రోమ్ (పీఎంఎస్) సమస్య తలెత్తుతోందని అంచనా వేస్తున్నారు. కొంతమంది లో హార్ట్ బీట్ పెరగడం, స్ట్రెస్ కి గురయ్యే మహిళల్లో ప్రీమెన్ స్ట్రువల్ సిండ్రోమ్ సమస్య ఎక్కువగా వస్తుందని ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ మంజులా అనగాని చెబుతున్నారు. ప్రీమెన్ స్ట్రువల్ సిండ్రోమ్ విషయంలో పలు రకాల లక్షణాలు కనిపిస్తాయి.
ఇది కూడా చదవండి.. ఒత్తిడి, ఆందోళనలకు బెస్ట్ సొల్యూషన్
ఇది కూడా చదవండి..సైనసిటిస్ ఎన్నిరకాలున్నాయంటే..?
ఇది కూడా చదవండి..మందులతో పని లేకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గేదెలా..?
మానసిక ఆందోళన, ఆకలి ఎక్కువగా అనిపించడం, అలసట, చిరాకు, నిరాశ వంటి సంకేతాలు కనిపిస్తాయి. ఈ మరికొందరిలో బరువు పెరిగినట్లు ఇంకొందరిలో బరువు తగ్గినట్లు కూడా అనిపించవచ్చని ఆమె చెబుతున్నారు. మహిళలు ఎదుర్కొనే గైనిక్ సమస్యల గురించి ప్రముఖ గైనకాలజిస్టు డాక్టర్ మంజులా అనగాని సాక్షి లైఫ్ కు మరింత సమాచారాన్ని అందించారు. ఆ సమాచారాన్నిఆమె మాటల్లోనే ఈ కింది వీడియో చూసి తెలుసుకోండి.
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
