డెలివరీ సమయంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే..? ఏమి చేయాలి..? 

షేర్ చేయండి:
డెలివరీ సమయంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే..? ఏమి చేయాలి..? 

సాక్షి లైఫ్ : గర్భం దాల్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆహరం విషయంలోనూ, జీవనవిధానం విషయంలోనూ మార్పు చేర్పులు చేసుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. డెలివరీ సమయంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. మొదటి నెల నుంచి చివరి నెల వరకూ కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి. 

ఇది కూడా చదవండి.. డెలివరీకి ముందు గర్భిణీలు "సీ" ఫుడ్ తినకూడదా..? 

 

ఇది కూడా చదవండి.. అధిక రక్తపోటు లక్షణాలు..? 

ఇది కూడా చదవండి.. మందులు లేకుండా అధిక రక్తపోటును నియంత్రించే మార్గాలు

ప్రెగ్నెన్సీ కేర్ టిప్స్..   

ప్రెగ్నెన్సీ సమయంలో కొన్ని విషయాలపై శ్రద్ధ చూపకపోతే  ఆనందకరమైన అనుభూతి విషాద కరంగా మారుతుంది. అందువల్ల, గర్భధారణ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యమని వైద్యనిపుణులు చెబుతున్నారు. గర్భం దాల్చిన చివరి నెలల్లో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే  ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

 గర్భిణీ సమయంలో జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్ తినడం కూడా పూర్తిగా మానేయాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఘాటైన మసాలాలు కారంగా ఉండే ఆహారం కడుపు సంబంధిత సమస్యలకు కారణమవుతాయి. 

ఎసిడిటీ సమస్య రాకుండా ఉండాలంటే టీ, కాఫీలు తక్కువగా తాగాలి. మద్యం సేవించడం పూర్తిగా మానేయాలి. గర్భధారణ ప్రారంభంలోనే కాదు, చివరి నెలల్లో కూడా అస్సలు తీసుకోకూడదని పరిశోధనలు చెబుతున్నాయి. 

 క్యాల్షియం అధికంగా ఉండే ఆహారం.. 

గర్భం దాల్చిన చివరి నెలలో క్యాల్షియం అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల పిల్లల ఎముకలు బలపడతాయి. అంతేకాకుండా, కాల్షియం తగినంతగా తీసుకోవడం వల్ల డెలివరీ తర్వాత కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. అందుకోసం ఆహారంలో పాలు, పెరుగు, నారింజ వంటి వాటిని చేర్చుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. 


ఫైబర్ ఫుడ్.. 

గర్భం చివరి నెలలో బిడ్డ పూర్తిగా తయారవుతుంది. దీని వల్ల బరువు కూడా పెరుగుతుంది. ఎలాంటి సమయంలో జీర్ణ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనిని నివారించడానికి గర్భిణీలు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని వైద్యనిపుణులు సలహా ఇస్తున్నారు.

ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..  

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..? 

  ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.