Ban on Deadly Paraquat : ప్రాణాంతక 'పారాక్వాట్'పై నిషేధం..! ఆన్‌లైన్ విక్రయాల నిలిపివేతకు ప్రభుత్వం కసరత్తు..
సాక్షి లైఫ్ : తెలంగాణ రాష్ట్రంలో అత్యంత ప్రమాదకరమైన 'పారాక్వాట్' హెర్బిసైడ్ అంటే కలుపు మందు విక్రయాలపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే దీని అమ్మకాలపై 60 రోజుల నిషేధం విధించిన సర్కారు, ఇప్పుడు ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో ఆన్‌లైన్ విక్రయాలను కూడా పూర్తిగా అడ్డుకునేందుకు కఠిన చర్యలు చేపట్టింది. ఈ మేరకు వ్యవసాయ శాఖా మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
ఇది కూడా చదవండి..Ajna Chakra : ఆజ్ఞా చక్రం శక్తిని పెంచడానికి ఏ యోగా సాధనలు చేయాలి..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..Top Medical Researches of 2025: వైద్య రంగంలో సరికొత్త సాంకేతికత: 2025 టాప్ రీసెర్చెస్..
ఎందుకింత ప్రమాదకరం..?
పారాక్వాట్ అనేది మొక్కల్లోని క్లోరోఫిల్‌ను దెబ్బతీసి వాటిని నిర్జీవంగా మార్చే ఒక శక్తివంతమైన రసాయనం. అయితే, ఇది మనుషులకు కూడా అంతే ప్రాణాంతకం. దీనికి ఇప్పటివరకు ఎలాంటి విరుగుడు (Antidote) కనుగొనలేదు. ప్రమాదవశాత్తు దీనికి గురైనా లేదా సేవించినా.. ఊపిరితిత్తులు దెబ్బతినడం, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్ వంటి సమస్యలతో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.
పొలాల్లో పిచికారీ చేసే సమయంలో చిన్నపాటి గాయాల ద్వారా ఇది శరీరంలోకి ప్రవేశించి రైతుల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (HRDA) తెలంగాణ ఐఎంఏ (IMA) స్వాగతించాయి. కీటక నాశినిగా పిలిచే ఈ విషం వల్ల రాష్ట్రంలో ఆత్మహత్యల సంఖ్య పెరగడమే కాకుండా, అత్యవసర వైద్య సేవలకు కూడా ఇది పెను సవాలుగా మారిందని వారు పేర్కొన్నారు. కేవలం రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా దీనిపై శాశ్వత నిషేధం విధించాలని కేంద్రాన్ని కోరారు.
60 దేశాల్లో ఇప్పటికే నిషేధం..
ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60 దేశాల్లో ఇప్పటికే ఈ రసాయనాన్ని నిషేధించారు. ఈ మందును తయారు చేసే సింజెంటా కంపెనీ ప్రధాన కార్యాలయాలు ఉన్న చైనా, స్విట్జర్లాండ్ లలో కూడా దీనిపై నిషేధం ఉండటం గమనార్హం. మన దేశంలో ఒడిశా ప్రభుత్వం ఇప్పటికే దీనిపై నిషేధం విధించగా, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అదే బాటలో పయనిస్తోంది.
పారాక్వాట్ నిషేధం అనేది ప్రజారోగ్యం, రైతుల భద్రత దిశగా ప్రభుత్వం తీసుకున్న గొప్ప నిర్ణయం. దీనివల్ల మరణాలను అడ్డుకోవచ్చని డాక్టర్ల సంఘాల ప్రతినిధులు .. ఈ నిషేధాన్ని ఉల్లంఘించి విక్రయాలు జరిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి..Best foods: కొలెస్ట్రాల్‌ను సహజంగా తగ్గించే ఆహార పదార్థాలు ఏవి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..Betel Leaves Help Reduce Cholesterol : తమలపాకు తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుందా..??
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
