Bird Flu Outbreak in California: కాలిఫోర్నియాలో 'బర్డ్ ఫ్లూ' పంజా..30 ఎలిఫెంట్ సీల్స్ మృతి..
సాక్షి లైఫ్ : అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ (Avian Influenza) మారణహోమం సృష్టిస్తోంది. శాన్ మాటియో కౌంటీలోని అన్యో నువో స్టేట్ పార్క్‌లో గత కొద్దిరోజులుగా సుమారు 30 ఎలిఫెంట్ సీల్స్ (Elephant Seals) మృతి చెందడం ఆందోళన కలిగిస్తోంది. మరణించిన వాటిలో అత్యధికంగా తల్లి పాలు మానిన చిన్న పిల్ల సీల్స్ (Pups) ఉండటం గమనార్హం.
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?
ఇది కూడా చదవండి..Medicinal Plants : ఔషధ మొక్కల రహస్యాలను పసిగట్టే సరికొత్త విధానం.. శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ..
ఇది కూడా చదవండి..Best Superfoods : క్యాన్సర్ ముప్పును తప్పించే 'సూపర్ ఫుడ్స్'
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
వ్యాప్తికి కారణాలు..లక్షణాలు..?
యూసీ డేవిస్ (UC Davis)యూసీ శాంటా క్రజ్ పరిశోధకులు ఈ మరణాలకు 'హెచ్5ఎన్1' (H5N1) వైరస్ కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. కాలిఫోర్నియా సముద్ర జీవులలో ఈ రకమైన వైరస్ వ్యాప్తి చెందడం ఇదే తొలిసారి.
వ్యాప్తి ఎలా..?
అనారోగ్యంతో ఉన్న పక్షులు లేదా వాటి విసర్జితాల ద్వారా ఈ వైరస్ ఎలిఫెంట్ సీల్స్‌కు సోకి ఉండవచ్చని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. వైరస్ బారిన పడిన సీల్స్ విపరీతమైన వణుకు (Tremors), శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మూర్ఛ (Seizures) వంటి లక్షణాలతో మరణిస్తున్నాయి. ఈ వైరస్ వల్ల కండరాలు, ఊపిరితిత్తులు, మెదడు తీవ్రంగా దెబ్బతింటున్నట్లు పోస్ట్‌మార్టం (Necropsy) నివేదికలో వెల్లడైంది.
అప్రమత్తమైన యంత్రాంగం..
వ్యాధి ఉధృతి దృష్ట్యా అధికారులు అన్యో నువో పార్క్‌లోని సీల్స్ సందర్శనను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ సీజన్‌లో ప్లాన్ చేసిన వందలాది పర్యటనలను రద్దు చేశారు. ఆస్పత్రులు, పరిశోధక బృందాలు ఈ వైరస్ ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. పౌరులు సముద్ర తీరాల్లో చనిపోయిన లేదా అనారోగ్యంగా ఉన్న జంతువులకు దూరంగా ఉండాలని, పెంపుడు జంతువులను వాటి దగ్గరకు తీసుకెళ్లకూడదని హెచ్చరిస్తున్నారు.
ఈ వైరస్ ఒకే జాతికి చెందిన జీవుల మధ్య వేగంగా వ్యాప్తి చెందుతోంది. అయితే మనుషులకు దీని వల్ల వచ్చే ముప్పు ప్రస్తుతం తక్కువగానే ఉన్నప్పటికీ, జాగ్రత్తగా ఉండటం తప్పనిసరని వైరాలజీ నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి..Aging symptoms : వృద్ధాప్య లక్షణాలు వేగంగా పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..China’s New Longevity Pill : ఆయువు పెంచే చైనా ఔషధంతో 150 ఏళ్లు బతకొచ్చా..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి.. కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
