Medicinal Plants : ఔషధ మొక్కల రహస్యాలను పసిగట్టే సరికొత్త విధానం.. శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ..  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ఆయుర్వేదం నుంచి అల్లోపతి వరకు.. అనేక రకాల మందుల తయారీలో వాడే చాలా ఔషధాలకు మూలం ప్రకృతిలో లభించే వృక్ష సంపదే. అయితే, ఒక మొక్కలో ఉండే వేల రకాల జీవక్రియల ఉత్పత్తులు (Metabolites) మానవ శరీరంలోని కణాలపై ఎలా పనిచేస్తాయో కచ్చితంగా అంచనా వేయడం ఇప్పటి వరకు ఒక సవాలుగా ఉండేది. ఈ చిక్కుముడిని విప్పుతూ ఎమోరీ యూనివర్శిటీ పరిశోధకులు ఒక అద్భుతమైన పద్ధతిని కనుగొన్నారు.

 

ఇది కూడా చదవండి..Aging symptoms : వృద్ధాప్య లక్షణాలు వేగంగా పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి..? 

ఇది కూడా చదవండి..China’s New Longevity Pill : ఆయువు పెంచే చైనా ఔషధంతో 150 ఏళ్లు బతకొచ్చా..?

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

 

ఏమిటీ 'మెటబాలిక్ స్నాప్‌షాట్'..?

సాధారణంగా ఒక మొక్కలోని సారాన్ని విశ్లేషించినప్పుడు, అందులో వందల కొద్దీ రసాయనాలు కనిపిస్తాయి. కానీ వాటిలో ఏది వ్యాధిని నయం చేస్తుంది? ఏది దుష్ప్రభావం చూపిస్తుంది..? అనేది తెలుసుకోవడానికి గతంలో భారీ ప్రయోగాలు అవసరమయ్యేవి.

శాస్త్రవేత్తలు కనుగొన్న తాజా పద్ధతి ప్రకారం.. ఒక మొక్క తాలూకు మొత్తం జీవక్రియల ప్రభావాన్ని ఒకే ఒక్క 'స్నాప్‌షాట్' చిత్రంలో చూసే వీలు కలుగుతుంది. దీని ద్వారా మొక్కలోని ఏ భాగం కణాల లోపలికి వెళ్లి వ్యాధిని అడ్డుకుంటుందో వేగంగా గుర్తించవచ్చు. సుదీర్ఘకాలం పట్టే క్లినికల్ ట్రయల్స్ అవసరం లేకుండానే, ప్రాథమిక స్థాయిలోనే మందు నాణ్యతను పరీక్షించవచ్చు.

ముందే తెలిసిపోతుంది...

శరీరంలోని ఆరోగ్యకరమైన కణాలకు ఆ మొక్కలోని రసాయనాలు హాని చేస్తున్నాయా..? లేదా..? అనేది ముందే తెలిసిపోతుంది. ఈ పరిశోధన సహజ సిద్ధమైన మందుల తయారీలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. మొక్కల నుంచి మరింత సురక్షితమైన, శక్తివంతమైన ఔషధాలను రూపొందించడానికి ఇది ఒక దిక్సూచిలా పనిచేస్తుందని ఎమోరీ యూనివర్శిటీ పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. 

ప్రస్తుతం క్యాన్సర్, మధుమేహం, వైరల్ ఇన్ఫెక్షన్లకు సంబంధించి ప్రకృతి సిద్ధమైన మందుల అన్వేషణలో ఈ టెక్నాలజీ కీలక పాత్ర పోషించనుంది. ముఖ్యంగా ప్రాచీన వైద్య విధానాల్లో వాడే మూలికల శాస్త్రీయతను నిరూపించడానికి ఈ 'స్నాప్‌షాట్' పద్ధతి ఎంతగానో ఉపయోగపడుతుందని వైద్యనిపుణులు భావిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.