Dangerous AQI Levels : ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో విషపు పొగ ఊపిరాడక జనాల ఇబ్బందులు..
సాక్షి లైఫ్ : దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలైన నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR)లో గాలి నాణ్యత అత్యంత ప్రమాదకర స్థాయిలో కొనసాగుతోంది. పొగమంచు, కాలుష్యం కలగలిసి నగరాన్ని దట్టమైన విషపు పొర కప్పేసింది. దీని కారణంగా ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఢిల్లీ సగటు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 318 వద్ద నమోదై, "చాలా తీవ్రమైన" (Very Poor) వర్గంలోకి చేరింది. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (CPCB) విడుదల చేసిన డేటా ప్రకారం, నగరంలోని అనేక ప్రాంతాల్లో AQI ఏకంగా 350 మార్కును దాటి, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం కలిగే ప్రమాదం ఉంది.
ఇది కూడా చదవండి.. Arthritis : ఆర్థరైటిస్ ఎలాంటి వాళ్లకు ఎక్కువ ప్రమాదకరం ఎందుకు..?
ఇది కూడా చదవండి..క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
వైద్యుల హెచ్చరిక..
AQI 300 దాటినప్పుడు గాలిలో ఉండే PM2.5 (2.5 మైక్రోమీటర్ల కంటే తక్కువ పరిమాణం గల సూక్ష్మ కణాలు) స్థాయిలు తీవ్రంగా పెరుగుతాయి. ఈ విష కణాలు ఊపిరితిత్తులలోకి, రక్తంలోకి సులభంగా ప్రవేశించి, ఆరోగ్యంపై దీర్ఘకాలికంగా తీవ్ర ప్రభావం చూపుతాయి.
ఎవరికి ప్రమాదం..?
శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు.. ఆస్తమా (Asthma), బ్రోన్కైటిస్ (Bronchitis), సిఓపిడి (COPD) ఉన్నవారికి శ్వాస తీసుకోవడం మరింత కష్టమవుతుంది. గుండె జబ్బులు ఉన్నవారు.. గుండెపై ఒత్తిడి పెరిగి, గుండెపోటు (Heart Attack) వచ్చే ప్రమాదం పెరుగుతుంది. వృద్ధులు, పిల్లలలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం కారణంగా త్వరగా అనారోగ్యం బారీన పడే ముప్పు ఉంది. ఈ వాతావరణంలో బయట జాగింగ్, వాకింగ్ ఇతర ఎక్సర్ సైజులు చేయడాన్ని పూర్తిగా మానుకోవాలని వైద్య నిపుణులు గట్టిగా హెచ్చరిస్తున్నారు.
గాలి నాణ్యత సూచీ (AQI)..
ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో గాలి నాణ్యత సూచీ (AQI) అత్యంత ఆందోళనకర స్థాయిలో కొనసాగుతోంది. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు (CPCB) నివేదిక ప్రకారం, అనేక ప్రాంతాల్లో పొల్ల్యూషన్ స్థాయిలు చాలా దారుణంగా (Very Poor) నమోదయ్యాయి. ముఖ్యంగా బవానాలో అత్యధికంగా 368 AQI, ఆ తర్వాత ముండ్కా (355) ఆనంద్ విహార్ (354) వద్ద గాలి నాణ్యత తీవ్రంగా క్షీణించింది. జహంగీర్‌పురి (348), నరేలా (344), రోహిణి (346), చాందిని చౌక్ (321), ITO (326) వంటి నగరంలోని కీలక ప్రాంతాలలో కూడా AQI 320 దాటింది.
ఢిల్లీకి ఆనుకుని ఉన్న ఘజియాబాద్‌లోని వసుంధరలో సైతం AQI 308తో 'చాలా పేలవమైన' వర్గంలో ఉండగా, వివేక్ విహార్ (291) నోయిడా సెక్టార్-62 (297) ప్రాంతాలు కూడా 'పేలవమైన' (Poor) స్థాయిలోనే నమోదయ్యాయి, ఇది ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. టీ లో ఎన్నిరకాల వెరైటీలున్నాయో తెలుసా..?
ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
