పాము కాటు కేసులను నోటిఫైడ్ డిసీజెస్ గా ప్రకటించండి..రాష్ట్రాలను కోరిన కేంద్రం..
సాక్షి లైఫ్ : పాము కాటు కారణంగా మరణాలు సంభవిస్తున్న కేసులను దృష్టిలో ఉంచుకుని, పాముకాటును నోటిఫైడ్ డిసీజ్ గా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అభ్యర్థించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపిన లేఖలో అన్ని ఆరోగ్య కేంద్రాలు పాముకాటు కేసులు, పాము కాటు మరణాల గురించిన సమాచారాన్ని అందించాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి తెలిపారు.
-అన్ని రాష్ట్రాలకు లేఖ రాసిన కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి.
-ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాలోని పాముకాటు కేసులను తప్పనిసరిగా నివేదించాలి.
-ప్రపంచవ్యాప్తంగా పాముకాటు కారణంగా మరణించిన కేసుల్లో సగం భారతదేశంలోనే నమోదవుతున్నాయి.
ఇది కూడా చదవండి..బ్లాక్ కాఫీ మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..ప్రతిరోజూ 30 నిమిషాలు నడవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
ఇది కూడా చదవండి..జింక్ లోపాన్ని అధిగమించడానికి ఎలాంటి ఆహారాలు అవసరం..?
పాముకాటును నోటిఫైడ్ డిసీజ్ గా ప్రకటించాలని, అన్ని ఆరోగ్య కేంద్రాలు అటువంటి కేసులు, మరణాలను నివేదించడాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను కోరింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలీల్ శ్రీవాస్తవ దేశంలోని అన్ని రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపిన లేఖలో పేర్కొన్నారు.
పాముకాటు అనేది ప్రజారోగ్య సమస్య అని, కొన్ని సందర్భాల్లో అది మరణం, అనారోగ్యం లేదా వైకల్యానికి దారితీస్తుందని రాశారు. రాష్ట్రాలు తమ ప్రజారోగ్య చట్టాలు లేదా ఇతర చట్టాల సంబంధిత సెక్షన్ల ప్రకారం పాముకాటును నోటిఫైడ్ డిసీజ్ గా ప్రకటించాలి. దీనితో పాటు, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాలు, వైద్య కళాశాలలు సైతం పాముకాటు కేసులు అనుమానిత కేసు లేదా మరణం గురించి తెలియజేయడాన్ని తప్పనిసరి చేయండి.
రైతులు, గిరిజన జనాభాలోనే ఎక్కువ..
రైతులు, గిరిజన జనాభా, ఇతరులతో పాటు పాముకాటుకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని లేఖలో పేర్కొన్నారు. పాముకాటు కేసులను ఎదుర్కోవటానికి, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 2030 నాటికి భారతదేశంలో పాముకాటు నివారణ, నియంత్రణ కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళికను కూడా ప్రారంభించింది. 2030 నాటికి పాము కాటు కారణంగా మరణాల సంఖ్యను సగానికి తగ్గించడమే ఈ ప్రణాళిక లక్ష్యం.
ఇది కూడా చదవండి..లైపోసక్షన్, బేరియాట్రిక్ సర్జరీలు ఎలాంటివారికి చేస్తారు..?
ఇది కూడా చదవండి..వాతావరణ మార్పలు దోమల వల్ల కలిగే వ్యాధుల వ్యాప్తిని ఎలా ప్రభావితం చేస్తాయి..?
ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..
ఇది కూడా చదవండి..బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ సక్సెస్ రేటు ఎంత?
ఇది కూడా చదవండి..న్యూ రిపోర్ట్ : ఆల్కహాల్ కారణంగా వచ్చే ఆరు రకాల క్యాన్సర్‌లు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
