Cervical Cancer : కేరళ మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ ముప్పు.. 7.9శాతం మందిపై ప్రభావం.. !

సాక్షి లైఫ్ : భారతదేశంలో మహిళలను పట్టి పీడిస్తున్న క్యాన్సర్లలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ (Cervical Cancer) ఒకటి. తాజాగా కేరళలో జరిగిన అధ్యయనాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. రాష్ట్రంలోని మహిళల్లో దాదాపు 7 నుంచి 9 శాతం మంది ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ కు గురవుతున్నారని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ సంఖ్య తక్షణమే ముందస్తు గుర్తింపు (Early Detection)నివారణ చర్యలను (Preventive Measures) వేగవంతం చేయాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తోంది.

 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే

 

మరణాల రేటు ఎవరిలో అధికం అంటే..? 

 స్థానికంగా రొమ్ము, థైరాయిడ్ క్యాన్సర్‌లు సాధారణంగా కనిపిస్తున్నప్పటికీ, గర్భాశయ క్యాన్సర్ వల్ల మరణాల రేటు (Mortality Rate) చాలా ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రధాన కారణాలు ఏమిటి..?

 హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) ఇన్ఫెక్షన్ కారణంగానే ఈ క్యాన్సర్ ప్రధానంగా వస్తుంది. అయితే, చాలామంది మహిళలు సరైన సమయంలో స్క్రీనింగ్ పరీక్షలు (Screening Tests) చేయించుకోవడంలో నిర్లక్ష్యం వహించడం వల్ల, వ్యాధి చివరి దశలో (Late-Stage Detection) గుర్తించాల్సి వస్తోంది. దీని కారణంగా సమయానికి చికిత్సఅందుకోలేక పోతున్నారు.

ఈ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించేందుకు కేరళ ఆరోగ్య శాఖ 'ఆరోగ్యం ఆనందం - అకట్టం అర్బుదం' అనే ప్రచారాన్ని చేపట్టింది. దీనిలో భాగంగా, అనుమానిత కేసులను ముందస్తుగా గుర్తించేందుకు 20 లక్షలకు పైగా మహిళలకు పరీక్షలు నిర్వహించి, క్యాన్సర్ నిర్ధారణ అయిన వారికి చికిత్స అందిస్తున్నారు.

నివారణ మార్గం (Prevention)..  

 ఈ క్యాన్సర్‌ను నివారించడానికి HPV వ్యాక్సినేషన్ అత్యంత ప్రభావవంతమైన మార్గం. కేరళ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల బాలికలకు 9-14 ఏళ్ల వయస్సు పెద్ద ఎత్తున టీకాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రతి మహిళా సమీపంలోని ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉన్న క్యాన్సర్ స్క్రీనింగ్ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ విజ్ఞప్తి చేశారు.

 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే....? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : women-health breast-cancer cancer-deaths cervical-cancer cancer-treatment cancer-factors cancer-cases kerala cancer risk-of-cancer cancer-risk cause-cancer cancer-survivor health-minister-veena-george veena-george
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com