Measles : మహమ్మారి మళ్లీ విజృంభణ..! : కెనడాకు షాక్.."మీజిల్స్ ఎలిమినేషన్ స్టేటస్' రద్దు..

సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య రంగంలో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. సుమారు 30 ఏళ్ల క్రితం సాధించుకున్న చారిత్రక విజయాన్ని కెనడా కోల్పోయింది. కెనడాలో మీజిల్స్ (తట్టు) వ్యాప్తి నిరంతరంగా కొనసాగుతుండటంతో, ఆదేశానికి లభించిన "మీజిల్స్ ఎలిమినేషన్ స్టేటస్' (Measles Elimination Status)"ను ప్యాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్ (PAHO) ఉపసంహరించుకుంది.

 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

 

  ఎలిమినేషన్ స్టేటస్ అంటే ఏమిటి..?

ఒక దేశంలో 12 నెలల పాటు స్థానికంగా ఒకే రకమైన మీజిల్స్ వైరస్ వ్యాప్తి నిరంతరంగా లేదని నిరూపించుకుంటే, అప్పుడు ఆ దేశానికి ఈ 'మీజిల్స్ రహిత హోదా' లభిస్తుంది. కెనడా 1998లోనే ఈ హోదాను సాధించింది. కానీ, గత ఏడాది కాలంగా వివిధ ప్రాంతాలలో మీజిల్స్ అదుపు లేకుండా వ్యాపిస్తుండటంతో,  Pan American Health Organization (PAHO) ఈ నిర్ణయం తీసుకుంది.

ప్రమాద ఘంటికలు..  

కెనడా ఈ హోదాను కోల్పోవడం వల్ల, యావత్ అమెరికాస్ ప్రాంతం (Region of the Americas) కూడా ఈ రహిత హోదాను కోల్పోయినట్లయింది.

 టీకాలపై నిర్లక్ష్యమే కారణమా..?

కెనడాలో మీజిల్స్ విజృంభణకు ప్రధాన కారణం.. టీకా (Vaccination) కవరేజీ తగ్గడం అని ఆరోగ్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒక ప్రాంతంలో మీజిల్స్ వ్యాప్తిని అరికట్టాలంటే కనీసం 95% మంది ప్రజలకు రెండు డోసుల టీకాలు అంది ఉండాలి.

అయితే, కెనడాలో వ్యాక్సినేషన్ రేట్లు ఈ స్థాయి కంటే పడిపోయాయి. కోవిడ్-19 మహమ్మారి తర్వాత టీకాలపై ప్రజల్లో పెరిగిన అపనమ్మకం కూడా దీనికి ఒక కారణంగా చెబుతున్నారు.

ముఖ్యంగా కొన్ని వర్గాలలో (మెన్నోనైట్ క్రిస్టియన్ కమ్యూనిటీల వంటివి) టీకా రేట్లు చాలా తక్కువగా ఉండటంతో, అంటువ్యాధి వేగంగా వ్యాపించింది.

పరిణామం: ఈ ఏడాదిలో ఇప్పటి వరకు కెనడాలో 5వేలకు పైగా మీజిల్స్ కేసులు, ఇద్దరు శిశువుల మరణాలు నమోదయ్యాయి.

అమెరికాకు హెచ్చరిక..!

కెనడా హోదా రద్దు నేపథ్యంలో, పొరుగున ఉన్న అమెరికా (USA) కూడా అప్రమత్తమైంది.అమెరికాలో కూడా మీజిల్స్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. టెక్సాస్, న్యూ మెక్సికో వంటి రాష్ట్రాల్లో పెద్దఎత్తున కేసులు వెలుగుచూశాయి.కెనడాలో వ్యాపిస్తున్న మీజిల్స్ జన్యు రకం, అమెరికాలోని టెక్సాస్, మెక్సికో ప్రాంతాల్లో వ్యాపిస్తున్న జన్యు రకంతో సమానంగా ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. మీజిల్స్ అత్యంత వేగంగా, ప్రమాదకరంగా వ్యాపించే అంటువ్యాధి కావడంతో, టీకా కవరేజీని అత్యవసరంగా పెంచాల్సిన అవసరం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కెనడాకు సూచించింది.

ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : kids-health measles-vaccine measles what-is-measles measles-disease measles-treatment measles-symptoms diagnose-measles measles-diagnosis measles-is-caused-by measles-news measles-outbreak measles-outbreak-news measles-transmission measles-explained measles-canada canada-measles-outbreak measles-elimination-status-revoked measles-epidemic canada-public-health who-canada north-america-measles
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com