ప్రమాదకర వ్యాధులకు కారణమవుతున్న ప్రోటీన్ లోపాలు.. కణాల్లో నాణ్యత నియంత్రణే కీలకం..!

సాక్షి లైఫ్ : జీవకణాల్లో (Living Cells) ప్రోటీన్లు (Proteins) అనేవి కీలకమైన 'వర్క్ హార్సెస్' వంటివి. వీటి నిర్మాణ రూపం (Structural Folds) పైనే వాటి విధి (Function) ఆధారపడి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే, ప్రోటీన్లు సరిగ్గా రూపొందక, మడతపడటంలో లోపం (Misfold) వస్తే.. అవి పనిచేయకపోవడమే కాక, క్యాన్సర్ (Cancer), న్యూరోడెజెనరేషన్ (Neurodegeneration) వంటి తీవ్రమైన వ్యాధులతో పాటు అరుదైన జన్యుపరమైన రుగ్మతలకు కూడా కారణమవుతాయని వారు వెల్లడిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..అవకాడోతో కలిపి తినకూడని ఆహారపదార్థాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?

 ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?

 

ఈ నేపథ్యంలో కణాలలో ప్రోటీన్ నాణ్యత నియంత్రణ (Protein Quality Control) గురించి లోతుగా అధ్యయనం చేయడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యరంగంలో తాజా పరిశోధనలపై చర్చించడానికి, సీఎస్ఐఆర్-సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (CSIR-CCMB), EMBO ఇండియా లెక్చర్ కోర్సును నిర్వహిస్తోంది. స్ట్రక్చర్, ఫంక్షన్ అండ్ క్వాలిటీ కంట్రోల్ ఆఫ్ ప్రోటీన్స్ ఇన్ సెల్ ఆర్గానెల్స్ (Structure, Function and Quality Control of Proteins in Cell Organelles) పేరుతో సిసిఎంబీఏలో ప్రత్యేకంగా ఐదురోజులపాటు సదస్సు జరుగుతోంది.

ఈ సదస్సు లక్ష్యాల గురించి సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ అండ్ కాన్ఫరెన్స్ లీడ్, డా. స్వస్తి రాయచౌధురి మాట్లాడుతూ.. "ఈ కోర్సు ద్వారా మాలిక్యులర్ అసెంబ్లీ, అవయవ ప్రోటీన్ల నాణ్యత, పనితీరు,  నియంత్రణకు సంబంధించిన తాజా భావనలను విద్యార్థులకు పరిచయం చేస్తామని చెప్పారు. మెథడలాజికల్ వర్క్‌షాప్‌ల ద్వారా సాంకేతిక నేపథ్యాన్ని అందించి, నిపుణులతో ముఖాముఖి చర్చల ద్వారా పరస్పర చర్యలను ప్రోత్సహిస్తాం" అని స్వస్తి రాయచౌధురి తెలిపారు.

నవంబర్ 10 నుంచి 14తేదీ వరకు జరిగే ఈ సదస్సులో దాదాపు 200 మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ నిపుణులతోపాటు, అడ్వాన్స్‌డ్ బయాలజీ విద్యార్థులు సమావేశమవుతారు. ఈ లెక్చర్ కోర్సు అణు అసెంబ్లీ (Molecular Assembly), అవయవ ప్రోటీన్ల నాణ్యత, విధి, నియంత్రణకు సంబంధించిన తాజా భావనలు, పద్ధతులను పరిచయం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది.

 కణ అవయవాల్లో (Cell Organelles) ప్రోటీన్ల ప్రయాణం.. 

కణాలలోకి ప్రవేశించిన తరువాత, దాదాపు 7వేల మానవ ప్రోటీన్లు తమ జీవితంలో ఏదో ఒక సమయంలో కణ అవయవాల (Subcellular Organelles) లోపల విభజన జరుగుతుంది. కణాల పనితీరు, మనుగడను కాపాడటానికి, ప్రోటీన్లు సరిగ్గా మడత పడి (Correctly Folded), సరిగ్గా అమర్చబడి (Assembled) నిర్వహిస్తున్నాయని నిర్ధారించుకోవడానికి కణాలు ప్రత్యేకమైన ప్రోటీన్ నాణ్యత నియంత్రణ వ్యవస్థలను కేటాయిస్తాయి. కణాల లోపల వివిధ అవయవాల గుండా ప్రోటీన్లు కదులుతున్నప్పుడు వాటి నాణ్యతను ఎలా కాపాడుతున్నాయో శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు.

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్‌లో ఎన్ని రకాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి..పనీర్ తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..? 

ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

Tags : protein-food protein protein-supplements high-protein biology-of-mosquitoes stem-cell-transplantation protein-content protein-intake protein-in-salmon protein-misfolding protein-quality-control ccmb-hyderabad protein-health protein-folding ccmb-embo-course advanced-biology
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com