సాక్షి లైఫ్ : ప్రపంచవ్యాప్తంగా ఫ్లూ కేసులు ఒక్కసారిగా పెరుగుతున్నాయి. దీనికి కారణం H3N2 వైరస్ లో వెలుగుచూసిన కొత్త రకం 'సబ్-క్లేడ్ కె' (Subclade-K). సాధారణ జ్వరం అని నిర్లక్ష్యం చేస్తే ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అసలు ఈ వేరియంట్ పాత వైరస్ కంటే భిన్నంగా ఎలా ఉంది..? ఈ వైరస్ కారణంగా శరీరంలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..? వేగంగా వ్యాపిస్తున్న ఈ వైరస్ లక్షణాలేంటి? ఇది ఎంత ప్రమాదకరం? ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారు? అన్న ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
ఇది కూడా చదవండి.. నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా..?
మరో కొత్త వైరస్ ప్రపంచవ్యాప్తంగా కలవరం పుట్టిస్తోంది. ఇన్‌ఫ్లుయెంజా 'ఏ'కి చెందిన సబ్ వేరియంట్ H3N2 ఇప్పుడు కొత్త రూపాన్ని సంతరించుకుంది. దీనిని శాస్త్రవేత్తలు 'సబ్-క్లేడ్ కె' (Subclade-K) గా పిలుస్తున్నారు. ఈ వేరియంట్ కారణంగా ప్రస్తుతం అనేక దేశాల్లో ఫ్లూ కేసులు వేగంగా పెరుగుతుండటంతో ఆరోగ్య నిపుణులు అప్రమత్తత అవసరమని హెచ్చరిస్తున్నారు.
ఏమిటీ 'సబ్-క్లేడ్ కె'..?
సాధారణంగా వచ్చే H3N2 వైరస్ తన జన్యు క్రమంలో మార్పులు (Mutations) చేసుకోవడం ద్వారా ఈ కొత్త వేరియంట్ ఉద్భవించింది.
గతంలో ఉన్న వేరియంట్ల కంటే ఇది వేగంగా వ్యాపిస్తోంది. ఈ వేరియంట్ తన ఉపరితల ప్రోటీన్లలో మార్పులు చేసుకోవడం వల్ల, గతంలో వచ్చిన ఇన్ఫెక్షన్ల ద్వారా లేదా పాత వ్యాక్సిన్ల ద్వారా మన శరీరంలో ఉన్న యాంటీబాడీలను ఇది సులభంగా తప్పించుకోగలుగుతోంది.
ప్రధాన లక్షణాలు ఎలా ఉంటాయంటే..?
ఈ కొత్త వేరియంట్ 'సబ్-క్లేడ్ కె' లక్షణాలు సాధారణ ఫ్లూ మాదిరిగానే ఉన్నప్పటికీ, కొంత తీవ్రంగా ఉంటున్నాయని చెబుతున్నారు. ఒక్కసారిగా 101°F కంటే ఎక్కువ జ్వరం రావడం. ఎడతెరపి లేని దగ్గు.. పొడి దగ్గు రెండు నుండి మూడు వారాల పాటు ఉంటుంది. విపరీతమైన నీరసం, ఒళ్లు నొప్పులు, కొంతమందిలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం. గొంతు నొప్పి, తలనొప్పి, పిల్లల్లో అయితే వాంతులు లేదా విరేచనాలు వంటి లక్షణాలు కనిపిస్తాయి.
ఎవరికి ముప్పు ఎక్కువ అంటే..?
5 ఏళ్లలోపు చిన్న పిల్లలకు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు, మధుమేహం, గుండె జబ్బులు, కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్న దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు,గర్భిణీ స్త్రీలు ఈ 'సబ్-క్లేడ్ కె' విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
నివారణ మార్గాలు-జాగ్రత్తలు..?
'సబ్-క్లేడ్ కె' వైరస్ సోకకుండా ఉండాలంటే ఈ నియమాలు తప్పనిసరి.. రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్క్ కచ్చితంగా ఉండాలి. తరచూ చేతులను సబ్బుతో లేదా శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి. ఫ్లూ లక్షణాలు ఉన్న వారికి దూరంగా ఉండాలి. నిపుణుల సలహా మేరకు ప్రతి ఏటా తీసుకునే 'ఫ్లూ వ్యాక్సిన్ ' తీసుకోవడం వల్ల తీవ్రతను తగ్గించవచ్చు.
జ్వరం రాగానే డాక్టర్ సలహా లేకుండా యాంటీబయాటిక్స్ వాడకూడదు. ఇది వైరస్ కాబట్టి యాంటీబయాటిక్స్ పనిచేయవు, పైగా దుష్ప్రభావాలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. "H3N2 సబ్-క్లేడ్ కె వేరియంట్ ను చూసి భయపడాల్సిన పనిలేదు, కానీ అప్రమత్తత చాలా ముఖ్యం. ముఖ్యంగా వృద్ధులు, పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలి. జ్వరం 3 రోజుల కంటే ఎక్కువగా వస్తూ ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com