Healthcare Scheme for Children : చిన్నారులకు కోసం ఢిల్లీ ప్రభుత్వం వినూత్న ఆరోగ్యపథకం.. 

సాక్షిలైఫ్ : పుట్టిన పసిబిడ్డల ఉజ్వల భవిష్యత్తు కోసం ఢిల్లీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఒక వినూత్న ముందడుగు వేసింది. చిన్నారుల్లో తలెత్తే జన్యుపరమైన, పుట్టుకతో వచ్చే లోపాలను ముందుగానే గుర్తించి, సకాలంలో చికిత్స అందించేందుకు 'అన్మోల్' (Advanced Newborn Monitoring and Optimal Life Care) పథకాన్ని ప్రారంభించింది. కేవలం ఒక్క రక్తపు చుక్కతో శిశువు జీవితాన్నే మార్చేసే అద్భుత అవకాశం ఈ పథకం ద్వారా లభించనుంది.

 

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

56 రకాల ఉచిత పరీక్షలు..  

సాధారణంగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కేవలం ఐదారు రకాల పరీక్షలకే భారీగా వసూలు చేస్తారు. కానీ, ఈ సరికొత్త పథకం కింద 56 రకాల వ్యాధులను గుర్తించే పరీక్షలను ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా అందించనుంది. ఒకే ఒక రక్తపు నమూనాతో మెటబాలిక్, జన్యుపరమైన లోపాలను గుర్తిస్తారు. ఈ పరీక్షల కోసం 'టాండమ్ మాస్ స్పెక్ట్రోమెట్రీ' (TMS) అనే అత్యాధునిక సాంకేతికతను వాడుతున్నారు. శిశువు పుట్టిన 24 గంటల నుంచి 10 రోజులలోపు ఈ పరీక్షలు చేయడం ద్వారా వైకల్యాలను, ప్రాణాపాయాన్ని నివారించవచ్చు.

ప్రాణాపాయం నుంచి రక్షణ.. 

మన దేశంలో ప్రతి నిమిషానికి దాదాపు 800 మంది శిశువులు జన్మిస్తున్నారు. గణాంకాల ప్రకారం, ప్రతి 300 మందిలో ఒక శిశువుకు ఇలాంటి లోపాలు ఉండే అవకాశం ఉంది. 'అన్మోల్' ద్వారా వీటిని సకాలంలో గుర్తిస్తే.. వినికిడి లోపాలు (Hearing loss), పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు, థైరాయిడ్ సమస్యలు (Hypothyroidism),వంటి వాటిని ప్రాథమిక దశలోనే అడ్డుకోవచ్చని వైద్యనిపుణులు చెబుతున్నారు.

దేశానికే ఆదర్శం.. 

ప్రస్తుతం కేరళలో 'శలభం' పేరుతో ఇలాంటి కార్యక్రమం నడుస్తుండగా, ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వం రూ. 25 కోట్ల బడ్జెట్‌తో ఈ భారీ ప్రాజెక్టును చేపట్టింది. మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ సీమా కపూర్ నేతృత్వంలో ఈ పథకం రూపుదిద్దుకుంది. ఇది విజయవంతమైతే దేశవ్యాప్తంగా పసిబిడ్డల మరణాల రేటును తగ్గించడంలో ఒక మైలురాయిగా నిలవనుంది. మీ చిన్నారి పుట్టిన వెంటనే ఇలాంటి స్క్రీనింగ్ పరీక్షలు చేయించడం వల్ల భవిష్యత్తులో వచ్చే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలను, అంగవైకల్యాన్ని నివారించవచ్చు.

 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..New Guidelines : శరీరానికి అవసరమయ్యే నీటి పరిమాణంలో కొత్త మార్గదర్శకాలు..

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : newborn-babies new-born-babies new-delhi government-scheme health-scheme
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com