నవజాత శిశువుల వైద్య పరీక్షల కోసం.. కొత్త మార్గదర్శకాలు జారీ..

సాక్షి లైఫ్ : నవజాత శిశువుల వైద్య పరీక్షలకు సంబంధించి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు ఆరోగ్య రక్షణ మంత్రిత్వ శాఖ కొత్త ప్రమాణాలను జారీ చేసింది దుబాయ్. దేశంలో జన్మించిన శిశువుల వైద్య పరీక్ష విధానాలను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో అధికారులు జాతీయ స్థాయిలో కొత్త మార్గదర్శకాలను విడుదల చేశారు.

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ రావడానికి ప్రధాన కారణాలు..?

ఇది కూడా చదవండి..టెఫ్లాన్ ఫ్లూ అంటే ఏమిటి..? 

ఇది కూడా చదవండి..నడక, పరుగు.. ఈ రెండిటిలో ఏది ఉత్తమం..? 

నవజాత శిశువులకు అవసరమైన లేబొరేటరీ, క్లినికల్ పరీక్షల జాబితాను సిద్ధం చేయడం, దేశవ్యాప్తంగా రిఫరెన్స్ లేబొరేటరీలను గుర్తించడం ద్వారా ముందస్తు ఆరోగ్య సమస్యలను నివారించడానికి ఇది సహాయపడుతుందని మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది.

కొత్త మార్గదర్శకాలలో రక్త పరీక్షలు, జన్యు నిర్ధారణ, జీవక్రియ, ఎండోక్రైన్ రుగ్మతలు, వినికిడి లోపాలు, గుండె సంబంధిత రుగ్మతలు ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలకు సంబంధించిన విధానాలు ఉన్నాయి.

దేశంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ మార్గదర్శకాలను అమలు చేయాలని ఆరోగ్య, రక్షణ మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. దీనితో పాటు, శిశువులలో జన్యుపరమైన వ్యాధుల డేటాబేస్ తయారు చేయనుంది. 

నవజాత శిశువులకు స్క్రీనింగ్ ప్రాముఖ్యతపై సమాజానికి అవగాహన కల్పించనున్నట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ డా. హుస్సేన్ అబ్దుల్ రెహమాన్ అల్ రాండ్ అన్నారు. రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి, అన్ని వయసుల వారికి ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లకు మద్దతు ఇవ్వడానికి మెరుగైన ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను అందించడానికి సాధ్యమైన ప్రతి ప్రయత్నం చేస్తామని ఆయన తెలిపారు.

 

ఇది కూడా చదవండి..న్యూరోసర్జన్లు వెన్నెముక శస్త్రచికిత్స చేయడానికి కూడా అర్హులే

ఇది కూడా చదవండి..పిల్లల స్క్రీన్ టైమ్ గురించి భారతీయ తల్లుల ఆందోళన

ఇది కూడా చదవండి..లివర్ సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి..?

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

Tags : kids-health kids-health-care newborn-babies kids new-guidelines dibai screening

Related Articles

Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com