డిజిటల్ డిటాక్స్ అనేది ఎలా ఉపయోగపడుతుంది..?

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : డిజిటల్ యుగం మన జీవితాలను అనేక రకాలుగా మార్చింది. ప్రస్తుతం చిన్న, పెద్ద అనే తేడాల్లేకుండా అందరూ ఇప్పుడు సమాచార సముద్రంలో మునిగిపోయాము. ఏదొక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ నుంచి ప్రతి సెకనుకు ఓ కొత్త సమాచారాన్ని పొందుతున్నాము. సోషల్ మీడియా, స్మార్ట్‌ఫోన్‌లు, ఇంటర్నెట్ అనేవి మన జీవితాలోకి ప్రవేశించాయి. అదే సమయంలో అవి మన మానసిక ఆరోగ్యానికి సవాళ్లుగా కూడా మారుతున్నాయి. నిరంతరం కనెక్ట్ అవ్వాలనే కోరిక,  పోల్చి చూసుకొనే అనుభూతి, ఆన్‌లైన్ వేధింపులు వంటి అంశాలు మన మానసిక ఆరోగ్యానికి హాని కలిగిస్తున్నాయి. అందువల్ల, ఈ డిజిటల్ యుగంలో, మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. డిజిటల్ యుగంలో మన మానసిక ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుచుకోవచ్చు..?

ఇది కూడా చదవండి.న్యూ రిపోర్ట్ : ఆల్కహాల్‌ కారణంగా వచ్చే ఆరు రకాల క్యాన్సర్‌లు ఇవే.. 

ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?

ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు.. 

ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి

   

స్మార్ట్ డివైస్ లతో.. 

స్మార్ట్ డివైస్ లతో ఎక్కువసేపు గడపడం వల్ల మానసికంగా అలసట, ఒత్తిడి, ఆందోళన,గందరగోళానికి గురవ్వాల్సి వస్తోంది. కాబట్టి అటువంటి పరికరాలకు కొద్ది గంటలు లేదా కొన్ని రోజులు, లేదా కొన్ని నెలలు దూరంగా ఉండడాన్నే "డిజిటల్ డిటాక్స్" గా భవిస్తారు. అయితే దీనికి డిజిటల్ మీడియాను మాత్రమే నిందిస్తే సరిపోదని, సాంకేతికత మనకు ఒక వరం, కానీ దానిని దుర్వినియోగం చేయడం వల్ల అది మనకే శాపంగా మారుతోందని మానసిక వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.

కాబట్టి మనం దానిని సరిగ్గా ఉపయోగించడం ముఖ్యమని, మనం వెనుకబడిపోయామనే భావనను దూరం చేస్తూ కొంత సమయం పాటు డిజిటల్ బ్రేక్ తీసుకోవడం చాలా ప్రధానమని వైద్యులు చెబుతున్నారు.  వారానికి ఒకసారి లేదా రోజుకు 1-2 గంటలు స్మార్ట్ డివైస్ లకు దూరంగా ఉండడం వల్ల మనసుకు విశ్రాంతి లభిస్తుంది. అలాగే, రోజంతా ఇ-మెయిల్‌ని తనిఖీ చేయకుండా, నిర్ణీత సమయంలో మాత్రమే దాన్ని తనిఖీ చేయండి. మీరు మీ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని వారు అంటున్నారు.  

 

ఇది కూడా చదవండి..మొటిమలను తొలగించడానికి ఎలాంటి చికిత్స చేస్తారు..?

ఇది కూడా చదవండి..న్యాచురల్ గా బతకడం అంటే..?

ఇది కూడా చదవండి..డైలీ మార్నింగ్ టైమ్ లో ఎలాంటివి తింటే.. హెల్తీగా ఉండొచ్చు..

ఇది కూడా చదవండి..పెరుగుతున్న మార్ బర్గ్ వైరస్ మరణాలు..

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.