Phantom Vibration Syndrome : ఫాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్ అంటే ఏంటి..? మైండ్ పై దీని ప్రభావం ఎలా ఉంటుంది..?
సాక్షి లైఫ్ : జేబులో ఫోన్ వైబ్రేట్ అయినట్లు అనిపిస్తుంది.. తీరా తీసి చూస్తే ఏ కాల్ వచ్చి ఉండదు, కనీసం మెసేజ్ కూడా రాదు. ఇలా మీకు ఎప్పుడైనా జరిగిందా..? అయితే మీరు 'ఫాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్' (Phantom Vibration Syndrome)కు లోనవుతున్నారని అర్థం చేసుకోవాలి. ఇది వినడానికి వింతగా ఉన్నా, నేటి డిజిటల్ యుగంలో అత్యధిక శాతం స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు ఎదుర్కొంటున్న మానసిక స్థితి అని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఏమిటీ భ్రాంతి అంటే..?
ఫాంటమ్ వైబ్రేషన్ అనేది ఒక రకమైన స్పర్శ భ్రాంతి. అంటే నిజానికి అక్కడ ఎటువంటి ప్రకంపనలు లేకపోయినా, మెదడు మాత్రం ఏదో కదలిక జరిగినట్లు పొరబడుతుంది. నిరంతరం స్మార్ట్‌ఫోన్‌కు అతుక్కుపోయే వారిలో ఈ లక్షణాలు అధికంగా కనిపిస్తున్నాయి.
మెదడు అప్రమత్తతే కారణం..
మనం ఏదైనా ముఖ్యమైన కాల్ లేదా మెసేజ్ కోసం ఎదురు చూస్తున్న ప్పుడు మన మెదడు అత్యంత అప్రమత్తంగా మారుతుంది. ఈ క్రమంలో బట్టలు చర్మానికి తగిలినా లేదా కండరాల్లో చిన్న కదలిక వచ్చినా మెదడు దానిని ఫోన్ వైబ్రేషన్‌గా తప్పుగా ప్రాసెస్ చేస్తుంది. ఫోన్‌ను ఎప్పుడూ ఒకే జేబులో లేదా శరీరానికి దగ్గరగా ఉంచుకోవడం వల్ల ఆ ప్రాంతం నుంచి వచ్చే చిన్నపాటి సంకేతాలకు కూడా మెదడు సున్నితంగా స్పందిస్తుంది.
నోమోఫోబియా..
స్మార్ట్‌ఫోన్ దగ్గర లేకపోతే వచ్చే ఆందోళనను నోమోఫోబియా అంటారు, సోషల్ మీడియాలో నిరంతరం చురుకుగా ఉండేవారిలో ఈ భ్రాంతి ఎక్కువగా ఉంటోంది.
బయటపడటం ఎలా అంటే..?
ఇది ఏదో ప్రమాదకరమైన వ్యాధి కాకపోయినప్పటికీ, మానసిక ప్రశాంతతను దెబ్బతీసే అవకాశం ఉంది. దీని నివారణకు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ఫోన్‌ను ఎప్పుడూ ఒకే జేబులో కాకుండా అప్పుడప్పుడు మార్చుతుండాలి. వీలైనంత వరకు ఫోన్‌ను రింగర్ మోడ్‌లో ఉంచడం లేదా వైబ్రేషన్‌ను పూర్తిగా ఆపివేయడం మేలు.
డిజిటల్ డిటాక్స్.. రోజులో నిర్ణీత సమయాల్లో ఫోన్‌ను పక్కన పెట్టేయాలి. నిద్రపోయే ముందు గంట ముందు నుంచి ఫోన్‌కు దూరంగా ఉండటం వల్ల మెదడుకు విశ్రాంతి లభిస్తుంది. మనం టెక్నాలజీని వాడుకోవాలి కానీ, అది మనల్ని వాడుకోకూడదు. డిజిటల్ ప్రపంచం నుంచి అప్పుడప్పుడు విరామం తీసుకోవడం వల్ల ఇటువంటి భ్రమల నుంచి సులభంగా బయటపడవచ్చు.
ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
