World Autism day 2026 : స్మార్ట్ ఫోన్ కారణంగా చిన్నారుల్లో 'వర్చువల్ ఆటిజం'.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : నేటి తరం పిల్లలు అన్నం తినాలన్నా, ఏడవకుండా ఉండాలన్నా తల్లిదండ్రుల చేతిలో ఉండే మొదటి ఆయుధం 'స్మార్ట్ ఫోన్'. కానీ, ఆ చిన్న తెర వెనుక ఒక పెద్ద ముప్పు పొంచి ఉందని మీకు తెలుసా..? హైదరాబాద్‌లోని ప్రముఖ వైద్యులు చిన్నారుల్లో పెరుగుతున్న 'వర్చువల్ ఆటిజం' (Virtual Autism) పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు వరల్డ్ ఆటిజం డే ఏప్రిల్ 2వ తేదీన సందర్భంగా ఈ వింత వ్యాధి లక్షణాలు, కారణాలపై సాక్షి లైఫ్ ప్రత్యేక కథనం..

 

ఇది కూడా చదవండి..హార్ట్ ఎటాక్ తర్వాత తొలి 60 నిమిషాలు ఎందుకంత కీలకం..?

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

ఇది కూడా చదవండి..కిడ్నీలు పనిచేయడం లేదని ఎలా తెలుసుకోవాలి..?

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

 

వర్చువల్ ఆటిజం..

గతంతో పోలిస్తే ప్రస్తుతం ఆస్పత్రులకు వచ్చే వర్చువల్ ఆటిజం కేసుల సంఖ్య 3 నుంచి 4 రెట్లు పెరిగిందని పీడియాట్రీషియన్లు చెబుతున్నారు. ముఖ్యంగా అతిగా గ్యాడ్జెట్లకు అలవాటు పడటం వల్లే పిల్లల్లో ఈ సమస్య వస్తోంది. ఇది జన్యుపరంగా వచ్చే ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ASD) లాగే అనిపించినా, దీనికి ప్రధాన కారణం మాత్రం చుట్టూ ఉండే 'డిజిటల్' వాతావరణమే.!

ప్రధానంగా కనిపించే లక్షణాలు..? 

మాటలు ఆలస్యమవ్వడం (Delayed Speech), కళ్లలోకి చూసి మాట్లాడలేకపోవడం (Poor Eye Contact),తోటి పిల్లలతో కలవలేకపోవడం, ఒంటరిగా ఉండటం, ప్రవర్తనలో వింత మార్పులు కనిపిస్తాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.

గ్యాడ్జెట్లతో గంటల తరబడి గడపడం..

చిన్నారులు రోజుకు 8 గంటల పాటు స్క్రీన్‌కే పరిమితం కావడంతో తీవ్ర ఒంటరితనానికి, ప్రవర్తన మార్పులకు గురవుతున్నట్లు న్యూరాలజిస్టులు గుర్తించారు. న్యూక్లియర్ ఫ్యామిలీలు పెరగడం, తల్లిదండ్రులు ఇద్దరూ ఉద్యోగస్తులు కావడం వల్ల పిల్లలు ఎక్కువగా ఫోన్లు, ట్యాబ్‌లపై ఆధారపడుతున్నారు. దీనివల్ల మెదడులోని న్యూరల్ కనెక్షన్లు దెబ్బతింటున్నాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

సమస్యను ఎదుర్కోవడం ఎలా..? 

పిల్లలను ఈ డిజిటల్ వ్యసనం నుండి కాపాడుకోవడానికి వైద్యులు కొన్ని కీలక మార్గాలను సూచించారు. పెద్దల సాన్నిహిత్యం..తాతయ్య, నానమ్మ లేదా ఇతర బంధువులతో పిల్లలు సమయాన్ని గడిపేలా చూడాలి. క్రియాశీల సంభాషణ.. తల్లిదండ్రులు పిల్లలతో రోజూ చురుగ్గా మాట్లాడాలి. ఒక చిన్నారి రోజుకు కనీసం పదివేల భావయుక్తమైన మాటలను వినాలి.

స్క్రీన్ టైమ్ నియంత్రణ.. 2 నుంచి 3 ఏళ్ల వయస్సు వచ్చే వరకు పిల్లలకు గ్యాడ్జెట్లు అస్సలు ఇవ్వకూడదు. ఆటలకి ప్రాధాన్యం..ఇంట్లోనే కాకుండా బయట తోటి పిల్లలతో ఆడుకునేలా ప్రోత్సహించాలి. ఆహార నియమాలు..ఆహారంలో చక్కెర శాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలి.

పరిష్కారం ఉందా..?

అదృష్టవశాత్తూ, జన్యుపరమైన ఆటిజం లాగా కాకుండా 'వర్చువల్ ఆటిజం'ను సకాలంలో గుర్తిస్తే నయం చేయవచ్చు. కేవలం ఫోన్ పక్కన పడేస్తే సరిపోదని, బిహేవియరల్ థెరపీ, కమ్యూనికేషన్ ట్రైనింగ్ వంటివి అవసరమని న్యూరాలజిస్టులు చెబుతున్నారు. పిల్లలకు ఫోన్ ఇవ్వడం అంటే వారికి ప్రపంచాన్ని చూపించడం కాదు.. వారి సొంత ఆలోచనా శక్తిని, కమ్యూనికేషన్ స్కిల్స్‌ను తుంచేయడమేనని వారు అంటున్నారు.

 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.