mental-health
Eating Together as a Family : కుటుంబంతో కలిసి భోజనం.. మెదడు చురుకుదనానికి ఇంధనం..!
సాక్షి లైఫ్ : ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో, సాంకేతికత పుణ్యమా అని ఒకే ఇంట్లో ఉంటున్నా ఎవరి లోకంలో వారు విహరిస్తున్నారు. అయితే, రోజులో కనీసం ఒక్కసారైనా కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చుని భోజనం చేయడం వల్ల మానసిక శ్రేయస్సు అద్భుతంగా మెరుగుపడుతుందని, మెదడు పనితీరు చురుగ్గా మారుతుందని బ్రిటన్ శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తేలింది. ఈ అలవాటు వల్ల ఒంటరితనం, రోజువారీ మానసిక ఒత్తిడి వంటి సమస్యలు దరిచేరవని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.
