హెయిర్ ఫాల్ సమస్యకు హోమియోవైద్యంలో చికిత్స ఉందా..?   

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : హెయిర్ ఫాల్ అనేది చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య. దీని కారణాలు అనేకంగా ఉండవచ్చు. ఆహారంలో లోపం, హార్మోనల్ మార్పులు, ఒత్తిడి, జీవనశైలి సమస్యలు, జెనెటిక్ కారకాలు మొదలైనవి. ఈ సమస్యను తగ్గించడానికి హోమియోపతిలో మంచి పనితీరు కనిపించే అవకాశాలున్నాయని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.  


జుట్టు రాలు సమస్యకు అందించే చికిత్సలో హోమియోపతి వైద్య విధానం ఒక వరం అని రుజువు అయ్యింది. అది కూడా ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా. సంప్రదాయ చికిత్సల వలె కాకుండా జుట్టు రాలడం సమస్యలు పునరావృతమయ్యే ప్రమాదాన్ని తొలగిస్తాయి. హోమియోపతి మందులు సహజంగా రసాయనాలు,స్టెరాయిడ్లు లేకుండా తయారు చేస్తారు. హోమియోపతి వైద్యంలో జుట్టు రాలడానికి గల మూల కారణాన్ని గుర్తించి అందుకు తగిన పరిష్కారాన్ని అందిస్తారు. జుట్టు రాలడానికి గల అంతర్లీన కారణాన్ని బట్టి హెయిర్ కేర్ తీసుకుంటారు.

 

ఇది కూడా చదవండి..ఎలాంటి ఫుడ్ స్ట్రెస్ ను తగ్గిస్తుంది..? 

ఇది కూడా చదవండి..నిద్రకు స్ట్రెస్ కు లింక్ ఏంటీ..? 

 

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ అంటువ్యాధా..? కాదా..?

ఇది కూడా చదవండి..పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్ కు కీమోథెరపీతో చికిత్స చేయవచ్చా..?

ఇది కూడా చదవండి..చికిత్సతో క్యాన్సర్ పూర్తిగా నయమవుతుందా..? 

 

 ప్రయోజనం ఏమిటంటే..? 

ఇప్పటికే ఉన్న లక్షణాలపై దృష్టి పెట్టడమే కాకుండా, రోగులకు సంబంధించిన పలు అంశాలను బట్టి జుట్టు రాలిపోవడానికి కారణాలు, వైద్య చరిత్రను విశ్లేషించి, మానసిక,శారీరక స్థితిని దృష్టిలో ఉంచుకుని వైద్యులు హోమియోపతి మందులను సూచిస్తారు. 

ఈ మందులు జుట్టు మూలాలకు పోషణను అందిస్తాయి. అప్పుడు సమస్యకు సరైన పరిష్కారం అంది జుట్టు పెరుగుతుంది. హెయిర్ ఫాల్ అనేది కొందరిలో వయస్సు పరిమితి లేదు. ఐరోపాలోని స్కిన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చేసిన ఒక అధ్యయనంలో ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా డైహైడ్రోటెస్టోస్టెరాన్ (డీహెచ్ టీ)ని ఎదుర్కోవడంలో హోమియోపతి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుందని వెల్లడించింది.


ఇది కూడా చదవండి..ఏ వైపు నిద్రించడం ఆరోగ్యానికి మంచిది..?


ఇది కూడా చదవండి..ఈ ఎనిమిది టిప్స్ పాటిస్తే రక్తంలో హిమోగ్లోబిన్ ను పెంచుకోవచ్చు.

 

ఇది కూడా చదవండి..మెనోపాజ్ కారణంగా మహిళల్లో వచ్చే ఇతర అనారోగ్య సమస్యలు.. 

 

ఇది కూడా చదవండి..ఆస్టియోపోరోసిస్ ను ఎలా నివారించవచ్చు..?

 

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.