నిద్రకు స్ట్రెస్ కు లింక్ ఏంటి..? 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : నిద్ర మన శరీరానికి, మానసిక ఆరోగ్యానికి ఎంతో కీలకమైనది.  నిద్ర తగ్గినా, గానీ అస్సలు నిద్ర లేకపోయినా గానీ అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. సరైన నిద్ర అనేది శరీరక, మానసిక సమస్యలను పరిష్కరిస్తుంది. మన ఆహారపు అలవాట్లు, నిద్ర మన శారీరక ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి. అదే విధంగా మన మానసిక ఆరోగ్యం కూడా చాలా ఎక్కువగా ప్రభావితమవుతుంది.

నిద్ర మన మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. అంతేకాదు ఒత్తిడి మరింతగా పెరిగి డిప్రెషన్ బారీన పడాల్సి వస్తుంది. దీని కారణంగా మానసిక సమస్యలు తలెత్తి జ్ఞాపక శక్తి తగ్గుతుందని మానసిక వైద్యనిపుణులు చెబుతున్నారు.  

మానసిక ఆరోగ్యం..  

సుదీర్ఘకాలం నిద్ర లేకపోవడం వల్ల ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయని సైకియాట్రిస్ట్ లు వెల్లడిస్తున్నారు. ఇది పలు సమస్యలకు తగిన పరిష్కారాలకు సరైన నిర్ణయం తీసుకోలేకపోవడంపై కూడా ప్రభావం చూపుతుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. నిద్ర సరిపోకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు కారణం అవుతుంది.   

 

ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ అంటువ్యాధా..? కాదా..?

ఇది కూడా చదవండి..పిల్లల్లో బ్లడ్ క్యాన్సర్ కు కీమోథెరపీతో చికిత్స చేయవచ్చా..?

ఇది కూడా చదవండి..చికిత్సతో క్యాన్సర్ పూర్తిగా నయమవుతుందా..? 

ఇది కూడా చదవండి..అపోహలు-వాస్తవాలు : వృద్ధులలో మాత్రమే బ్లడ్ క్యాన్సర్ వస్తుందా..?

 

మానసిక వైద్యనిపుణులు .. 

అటువంటి పరిస్థితులలో, మానసికంగా దృఢంగా ఉండటానికి, మానసిక స్థితి నియంత్రణకు ప్రతిరోజూ ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర అవసరం అని మానసిక వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇది మెదడు పనితీరుకు మద్దతు ఇవ్వడం, రోజువారీ ఒత్తిడిని తొలగించడానికి ,మానసిక ప్రశాంతతను మెరుగుపరచడమేకాకుండా, మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. తద్వారా మానసికంగా హెల్తీగా ఉండొచ్చు.   


నిద్ర ఎందుకు ముఖ్యం అంటే..?

మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగినంత నిద్ర అవసరమని వైద్యులు చెబుతున్నారు. మనం నిద్రపోతున్నప్పుడు, మన మెదడుకు జ్ఞాపకాలను నిల్వచేసుకోవడానికి, భావోద్వేగాలను ప్రాసెస్ చేయడానికి మరియు కోలుకోవడానికి అవకాశం ఉంటుంది. నిద్ర లేకపోవడంఅనేది నిద్ర ఈ ప్రక్రియలకు అంతరాయం కలిగిస్తుంది. దీని కారణంగా దేని మీద శ్రద్ధ పెట్టలేరు.


ఇది కూడా చదవండి..ఏ వైపు నిద్రించడం ఆరోగ్యానికి మంచిది..?


ఇది కూడా చదవండి..ఈ ఎనిమిది టిప్స్ పాటిస్తే రక్తంలో హిమోగ్లోబిన్ ను పెంచుకోవచ్చు.

.
ఇది కూడా చదవండి..మెనోపాజ్ కారణంగా మహిళల్లో వచ్చే ఇతర అనారోగ్య సమస్యలు.. 


ఇది కూడా చదవండి..ఆస్టియోపోరోసిస్ ను ఎలా నివారించవచ్చు..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.