 
                                                        సాక్షి లైఫ్ : వైన్ (Wine) అనేది గుండె ఆరోగ్యానికి మంచిదనే ప్రచారం దశాబ్దాలుగా ఉంది. అయితే, రెడ్ వైన్ (Red Wine), వైట్ వైన్ (White Wine) లో ఏది మన హార్ట్ ను ఎక్కువగా కాపాడుతుంది అనే దానిపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ విషయంపై శాస్త్రవేత్తలు చేపట్టిన తాజా అధ్యయనాలు ఏం చెబుతున్నాయి..? ఈ రెండింటిలో ఏది బెటర్ అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
 
వివిధ దేశాల్లో ప్రజలపై జరిపిన అంతర్జాతీయ విశ్లేషణల ప్రకారం.. వైన్ తాగేవారిలో, వైన్ తాగనివారితో పోలిస్తే, కరోనరీ హార్ట్ డిసీజ్ (Coronary Heart Disease - CHD) వచ్చే ప్రమాదం సుమారు 24 శాతం వరకు తక్కువగా ఉన్నట్లు పరిశోధకులు అంచనా వేశారు.
 
 వైన్, ముఖ్యంగా రెడ్ వైన్, ద్రాక్ష తొక్కలు, విత్తనాల నుంచి వచ్చే పాలీఫెనాల్స్ అనే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లను కలిగి ఉంటుంది. ఇవి రక్త నాళాలను సడలించి, రక్త ప్రసరణను మెరుగుపరిచే నైట్రిక్ ఆక్సైడ్ (Nitric Oxide) ఉత్పత్తికి తోడ్పడతాయి.
రెడ్ వైన్ ..
రెడ్ వైన్ తయారీలో ద్రాక్ష తొక్కలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి, వైట్ వైన్‌తో పోలిస్తే ఇందులో పాలీఫెనాల్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే సాంప్రదాయకంగా రెడ్ వైన్‌నే గుండెకు మేలు చేస్తుందని నమ్ముతారు.
శాస్త్రవేత్తలు ఏమి చెబుతున్నారు అంటే..?
శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనాలు వైన్ తాగడం ద్వారా గుండె ఆరోగ్యం గా ఉంటుందని చెప్పినప్పటికీ, నిపుణులు ముఖ్యమైన విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. వైన్ రంగు కాదు, మోతాదు ముఖ్యం అని అంటున్నారు. గుండెకు రెడ్ వైన్ కంటే వైట్ వైన్ ఉత్తమమైనదని చెప్పడానికి తగినన్ని స్పష్టమైన ఆధారాలు లేవు. చాలా మందికి, వైన్ రంగు కంటే, ఎంత మోతాదులో తాగుతున్నారు అనేదే ముఖ్యమని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.
సురక్షితమైన మోతాదు (Moderation): మీరు వైన్ తాగాలనుకుంటే, మితంగా తీసుకోవడమే గుండె ఆరోగ్యానికి ఉత్తమం. అంటే, మహిళలు రోజుకు ఒక గ్లాసు, పురుషులు రోజుకు ఒకటి లేదా రెండు గ్లాసుల కంటే ఎక్కువ తాగకూడదు.
ఆల్కహాల్ లేనిదే ఉత్తమం..
కొందరు పరిశోధకులు రెడ్ వైన్‌లోని ఆల్కహాల్‌ను తొలగించి (Dealcoholized Red Wine) ప్రయోగాలు చేశారు. ఈ ఆల్కహాల్-రహిత వైన్ కూడా రక్తపోటును తగ్గిస్తుంది అని తేలింది. కాబట్టి, గుండె ప్రయోజనాల కోసం ఆల్కహాల్ తాగాల్సిన అవసరం లేదని, ద్రాక్షలోని పోషకాలే ప్రయోజనకరమని తెలుస్తోంది. గుండెకు వైన్ మంచిదనే అపోహ ప్రమాదకరం కావచ్చని ప్రఖ్యాత హెపటాలజిస్టులు (కాలేయ నిపుణులు) హెచ్చరిస్తున్నారు.
"ఫ్యాటీ లివర్ (Fatty Liver)" లేదా ఇతర కాలేయ సమస్యలు ఉన్నవారు వైన్ (ఆల్కహాల్) ను పూర్తిగా మానుకోవాలి. రోజువారీగా రెడ్ వైన్ తాగడం వల్ల గుండెకు మేలు జరుగుతుందనే అపోహతో తాగి, కాలేయ నష్టాకి (Liver Damage) గురైన రోగుల కేసులను సైతం వైద్యనిపుణులు గుర్తించారు. ఆరోగ్య ప్రయోజనాల కోసం మద్యం తాగడం ఏమాత్రం మంచిది కాదని వారు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com