సెకండ్‌హ్యాండ్‌ స్మోకింగ్‌.. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం..!

షేర్ చేయండి:
సెకండ్‌హ్యాండ్‌ స్మోకింగ్‌.. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం..!

సాక్షి లైఫ్ : పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు. కానీ, మీరు పొగతాగకపోయినా, పక్కన ఎవరైనా పొగతాగితే ఆ పొగ వల్ల మీ ఆరోగ్యానికి కూడా ముప్పు ఉంటుందని మీకు తెలుసా? దీన్నే 'సెకండ్‌హ్యాండ్‌ స్మోకింగ్' లేదా 'పాసివ్ స్మోకింగ్' అంటారు. ఈ కనిపించని పొగ పెద్దల నుంచి పిల్లలతోపాటు, గర్భిణీల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్ ఎక్కువయితే కనిపించే సంకేతాలు ఎలా ఉంటాయంటే..? 

ఇది కూడా చదవండి..రక్త కణాల ఉత్పత్తిలో కాపర్ పాత్ర..?

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

ఇది కూడా చదవండి..ప్రోస్టేట్ క్యాన్సర్ ఎలాంటివారికి వస్తుంది..?

 తీవ్ర ప్రభావం..  

సెకండ్‌హ్యాండ్‌ స్మోకింగ్ పెద్దల్లో గుండె జబ్బులకు ప్రధాన కారణాలలో ఒకటిగా నిలుస్తుంది. ఇది గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యల ప్రమాదాన్ని 25- 30శాతం వరకు పెంచుతుంది. అలాగే, COPD (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్) వంటి దీర్ఘకాలిక శ్వాసకోశ వ్యాధులు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో సహా ఇతర రకాల క్యాన్సర్లకు గురయ్యే ప్రమాదం 20-30శాతం వరకు పెరుగుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

పిల్లలకు ప్రమాదం.. 

పిల్లలు పొగకు గురైనప్పుడు, వారి శరీరం ఇంకా అభివృద్ధి చెందుతు న్నందున, వారిపై ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. సెకండ్‌హ్యాండ్‌ స్మోకింగ్ వల్ల పిల్లల్లో ఆస్తమా, బ్రాంకైటిస్, న్యుమోనియా వంటి శ్వాస సంబంధిత సమస్యలు పెరుగుతాయి. ముఖ్యంగా, 'సిడ్స్' (SIDS - Sudden Infant Death Syndrome) అంటే ఆకస్మిక శిశు మరణాల ప్రమాదం పెరుగుతుంది. ఇది తల్లిదండ్రులకు ఆందోళన కలిగించే విషయం.

గర్భిణీలకు, పుట్టబోయే బిడ్డకు ముప్పు..

గర్భిణీ స్త్రీలు సెకండ్‌హ్యాండ్‌ స్మోకింగ్‌కు గురైతే గర్భస్రావం జరిగే ప్రమాదం ఉంది. అంతేకాకుండా, తక్కువ బరువుతో బిడ్డ పుట్టడం, బిడ్డకు శారీరక సమస్యలు, అభివృద్ధి లోపాలు తలెత్తవచ్చు. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంపై పొగ ప్రభావం దీర్ఘకాలికంగా ఉండవచ్చని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..30కి పైగా వ్యాధికారక క్రిముల జాబితాను విడుదల చేసిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్.. 

ఇది కూడా చదవండి..వృద్ధులలో తుంటి నొప్పికి కారణాలు ఏమిటి..?

ఇది కూడా చదవండి..పొద్దున్నే నిద్ర లేవగానే అలసటగా అనిపిస్తుందా..? కారణాలు ఇవే కావచ్చు.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.