రాత్రి సమయంలో మెలకువగా ఉంటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసా..?
సాక్షి లైఫ్ : ప్రతిరోజూ అలసిపోయిన తర్వాత చాలా మందికి పడుకోగానే నిద్ర వస్తుంది. మరికొందరికి త్వరగా నిద్ర పట్టదు. ఇలాంటి పరిస్థితుల్లో అర్థరాత్రి వరకు మెలకువగా ఉంటారు. ఆఫీస్ పనుల వల్ల చాలా మంది రాత్రిపూట మెలకువగా ఉండాల్సి వస్తుంది. అయితే అది మీ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా..?
ఇది కూడా చదవండి..రక్తంలో ఆక్సిజన్ తగ్గినప్పుడు ఎలాంటి సమస్యలు వస్తాయి..?
ఇది కూడా చదవండి..నల్ల బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు..
ఇది కూడా చదవండి..ఫర్ హార్ట్ హెల్త్ : జిమ్‌కు వెళ్లినప్పుడు ఈ విషయాలను గుర్తుంచుకోండి.
ఇది కూడా చదవండి..ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఎలా ఉండాలి..?
-తగినంత నిద్ర లేకుంటే జీవితకాలం తగ్గిపోతుంది.
-నిద్ర లేకపోవడం వల్ల రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది.
-నిద్రలేమి కారణంగా జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదం ఉంది.
కొంతమందికి వింత వింత అలవాట్లు ఉంటాయి. రాత్రిపూట మేల్కొని పని చేయడం లేదా సినిమాలు చూడడం అంటే ఇష్టపడుతుంటారు. ఈ రోజుల్లో చాలా మంది ప్రజలు ముఖ్యంగా యువకులు రాత్రిపూట మేల్కొని ఉంతున్నారు. చాలా సార్లు, ఆఫీసు పని కారణంగా దానిని రాత్రిపూట మేల్కొని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. అటువంటి పరిస్థితిలోవారు తగినంత నిద్ర పొందలేరు. దీనివల్ల వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుంది.
ఆరోగ్యం పట్ల ఇలాంటి అజాగ్రత్త చాలా రోగాలకు దారి తీస్తుంది. ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం ప్రతిరోజూ 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. లేదంటే మానసిక సమస్యలు తప్పవని సైకాలజిస్టులు చెబుతున్నారు. ఇంతకంటే తక్కువ నిద్రపోయేవారు స్థూలకాయం, చిరాకు, తలనొప్పి తదితర సమస్యలతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మీరు కూడా ఈ పొరపాటు చేస్తే, మీ ఆరోగ్యం ఎంతగా దెబ్బతింటుంది..అంటే..?
జీవితకాలం తగ్గిపోతుంది..
తగినంత నిద్ర లేకుంటే జీవితకాలం తగ్గిపోతుంది. దక్షిణ కొరియాలో 16 ఏళ్లుగా తక్కువగా నిద్రపోయే వారిపై ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. ఈ పరిశోధన 40 నుంచి 69 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులపై నిర్వహించారు.
ఈ అధ్యయనంలో రాత్రిపూట ఎక్కువసేపు మెలకువగా ఉండేందుకు ఇష్టపడేవారు చిన్నవయసులోనే ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
మెదడుపై తీవ్ర ప్రభావం..
రాత్రిపూట ఎక్కువ సేపు మెలకువగా ఉండే వ్యక్తులు జ్ఞాపకశక్తి కోల్పోవడమేకాకుండా యాక్టివ్ గా ఉండలేరు. ఆందోళన, ఒత్తిడి సమస్యలు తలెత్తుతాయి.
అధిక బరువు సమస్య..
రాత్రిపూట తక్కువ నిద్రపోయేవారు బరువు పెరిగే అవకాశం ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి వ్యక్తుల్లో హార్మోన్ల అసమతుల్యత కారణంగా త్వరగా బరువు పెరుగుతారని తద్వారా పలు అనారోగ్య సమస్యలు బారీన పడే ప్రమాదం ఉందని అంటున్నారు డాక్టర్లు.
రోగనిరోధక శక్తి ..
రాత్రిపూట తగినంత నిద్ర లేని వ్యక్తులకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. దాని కారణంగా వారు త్వరగా అనారోగ్యానికి గురవుతారు. అందువల్ల, రాత్రిపూట తగినంత నిద్ర పోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి..రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో లింక్ ఉన్న అనారోగ్య సమస్యలు ఏమిటి?
ఇది కూడా చదవండి..గుండె జబ్బులకు కొలెస్ట్రాల్ కు లింక్ ఏంటి..?
ఇది కూడా చదవండి..క్యాన్సర్ : ఈ 5 ఆహారాలను ఎక్కువ సేపు వండడం మరణాన్ని ఆహ్వానించినట్లే..
ఇది కూడా చదవండి..టీబీ రోగులకు అందించే సహాయాన్ని రెట్టింపు చేసిన కేంద్ర ప్రభుత్వం
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
