Winter season : విటమిన్-డి లోపాన్ని దూరం చేసే అద్భుతమైన ఆహారాలు ఇవే..!

సాక్షి లైఫ్ : పెరుగుతున్న వాయు కాలుష్యం (Air Pollution), ముఖ్యంగా శీతాకాలంలో దట్టంగా అలుముకునే పొగమంచు (Smog) కారణంగా ప్రజలు ఇంటి నుంచి బయటకు వెళ్లడానికి సందేహిస్తున్నారు. ఫలితంగా, శరీరానికి అత్యంత ముఖ్యమైన సూర్యరశ్మి (Sunlight) ద్వారా లభించే విటమిన్-డి (Vitamin D) ఉత్పత్తి తగ్గిపోతోంది. ఎముకల ఆరోగ్యం, రోగనిరోధక శక్తికి (Immunity) అత్యవసరమైన విటమిన్-డి లోపం (Deficiency) తలెత్తితే, అలసట, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. చలికాలంలో సూర్యరశ్మి ద్వారా లభించే విటమిన్-డి తగ్గితే.. కొన్ని ఆహార పదార్థాలు, సప్లిమెంట్ల ద్వారా ఆ లోపాన్ని భర్తీ చేయవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..? 

 

సూర్యరశ్మి లేని సమయంలో ఈ విటమిన్-డి లోపాన్ని దూరం చేయడానికి ఆహారం తీసుకోవడమే సులభమైన మార్గం. మీ డైట్‌లో తప్పక చేర్చుకోవాల్సిన విటమిన్-డి అధికంగా ఉండే ఆహారాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 


1. కొవ్వు అధికంగా ఉండే చేపలు (Fatty Fish).. 

విటమిన్-డికి అత్యంత సహజసిద్ధమైన, సమృద్ధిగా లభించే వనరుల్లో సాల్మన్ (Salmon), సార్డినెస్ (Sardines), ట్యూనా (Tuna), మకెరెల్ (Mackerel) వంటి కొవ్వు చేపలు ముఖ్యమైనవి. ఇవి విటమిన్-డి తో పాటు గుండె ఆరోగ్యానికి మేలు చేసే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లను (Omega-3 Fatty Acids) కూడా అందిస్తాయి.

2.  గుడ్డు పచ్చసొన (Egg Yolk).. 

గుడ్డులోని తెల్లసొనలో విటమిన్-డి లేకపోయినా, పచ్చసొనలో కొద్ది మొత్తంలో విటమిన్-డి ఉంటుంది. రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు తినడం ద్వారా విటమిన్-డి అవసరాన్ని కొంతవరకు తీర్చుకోవచ్చు.

బయట తిరిగే కోడి(నాటుకోడి)గుడ్లలో (Free-range eggs) ఈ విటమిన్-డి శాతం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

3. యూవీ-ఎక్స్‌పోజ్డ్ పుట్టగొడుగులు (UV-Exposed Mushrooms).. 

పుట్టగొడుగులు (Mushrooms) విటమిన్-డి అందించే కొన్ని శాకాహార వనరులలో ఒకటి. కొన్ని రకాల పుట్టగొడుగులను ప్రత్యేకంగా అల్ట్రావైలెట్ (UV) కాంతికి గురి చేయడం ద్వారా వాటిలో విటమిన్-డి2 స్థాయిని పెంచుతారు. మార్కెట్‌లో 'విటమిన్-డి ఎక్కువగా ఉన్న పుట్టగొడుగులు' అని లేబుల్ వేసిన వాటిని మాత్రమే ఎంచుకోవాలి.

4. ఫోర్టిఫైడ్ ఆహారాలు (Fortified Foods).. 

సహజంగా విటమిన్-డి తక్కువగా లభించే ఆహారాలలో అదనంగా విటమిన్-డి ని జోడించి (Fortify) మార్కెట్‌లో విక్రయిస్తారు. చాలా వరకు పాలు (Milk), పెరుగు (Yogurt) కొన్ని రకాల జున్ను (Cheese) బ్రాండ్లు విటమిన్-డి తో ఫోర్టిఫై చేస్తారు. కొన్ని బ్రాండ్ల ఆరంజ్ జ్యూస్ (Orange Juice) సోయా/బాదం పాలు (Soy/Almond Milk) కూడా విటమిన్-డి తో ఫోర్టిఫై చేస్తారు.  కొన్ని రకాల బ్రేక్‌ఫాస్ట్ ధాన్యాలు (Breakfast Cereals) కూడా విటమిన్-డి తో అందిస్తారు.

5. కాడ్ లివర్ ఆయిల్ (Cod Liver Oil)..  

ఇది చేపల కాలేయం నుంచి తీసిన నూనె. విటమిన్-డి తో పాటు ఆరోగ్యకరమైన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఇందులో పుష్కలంగా ఉంటాయి. దీన్ని సప్లిమెంట్ (Supplement) రూపంలో తీసుకోవడానికి ముందు తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.

విటమిన్-డి లోపం తీవ్రంగా ఉంటే, కేవలం ఆహారం ద్వారా భర్తీ చేయడం కష్టం కావచ్చు. అటువంటి పరిస్థితులలో, రక్త పరీక్ష (Blood Test) చేయించుకుని, వైద్యుల సలహా మేరకు విటమిన్-డి సప్లిమెంట్లను (D3 Supplements) వాడటం ఉత్తమం.

 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 ఇది కూడా చదవండి..మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : vitamin-d d-vitamin vitamin-d-deficiency vitamin-d-deficiency-symptoms vitamin-deficiency vitamin-d-deficiency-causes signs-of-vitamin-d-deficiency vitamin-d-deficiency-treatment vitamin-d-deficiency-and-depression vitamin-deficiency-problem
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com