సాక్షి లైఫ్ : చలికాలం (Winter Season) వచ్చిందంటే మార్కెట్లో రకరకాల తాజా కూరగాయలు, ఆకుకూరలు దర్శనమిస్తాయి. ప్రకృతి మన శరీరానికి చలిని తట్టుకునే శక్తిని, రోగనిరోధక శక్తిని (Immunity) పెంచడానికి ఈ సమయంలో అద్భుతమైన పోషకాలు నిండిన ఆహారాన్ని అందిస్తుంది. ఈ కూరగాయలు సాధారణ రోజుల్లో లభించినా, చలికాలంలో వాటిలో పోషకాలు మరింత ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సీజన్‌లో తప్పక తినాల్సిన, సూపర్‌ఫుడ్‌తో సమానమైన 5 కూరగాయలు ఏంటో, వాటి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..అవకాడోతో కలిపి తినకూడని ఆహారపదార్థాలు ఏమిటి..?
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..ప్లేట్‌లెట్ కౌంట్ ను ఎలా పెంచుకోవచ్చు..?
ఇది కూడా చదవండి..కొరియన్ డైట్ తో వేగంగా బరువు తగ్గడం ఎలా..?
1. పాలకూర (Spinach)..
పోషకాలు: విటమిన్ కె, విటమిన్ ఏ, ఫోలేట్, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి.
ప్రయోజనాలు ఏమిటంటే..? ఎముకలకు బలం.. విటమిన్ కె ఎముకలను దృఢంగా ఉంచుతుంది. రక్తహీనత నివారణకు ఐరన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఐరన్ కంటెంట్ రక్తం ఉత్పత్తికి సహాయ పడుతుంది. ఇందులో ఉండే ల్యూటిన్, జియాక్సాంథిన్ కంటి చూపును మెరుగుపరుస్తాయి.
2. క్యారెట్ (Carrot)..
పోషకాలు: బీటా-కెరోటిన్, విటమిన్ A, విటమిన్ C మరియు ఫైబర్ అధికంగా ఉంటాయి.
ప్రయోజనాలు ఏమిటంటే..? రోగనిరోధక శక్తి.. విటమిన్ ఏ రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచుతుంది, ఇది చలికాలంలో వచ్చే జలుబు, ఫ్లూ నుంచి రక్షణ ఇస్తుంది. అంతేకాదు చర్మాన్ని నిగారింపుగా ఉంచడంతోపాటు, చర్మాన్ని పొడిబారకుండా కాపాడుతుంది. ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు గుండెకు మేలు చేస్తాయి.
3. మెంతికూర (Fenugreek/Methi)..
పోషకాలు ఎన్నో.. ఫైబర్, ఐరన్, విటమిన్ కె, విటమిన్ సి, మెగ్నీషియం మెండుగా ఉంటాయి.
ప్రయోజనాలు ఏమిటంటే..?
ఇందులో ఉండే కరిగే ఫైబర్ (Soluble Fibre) చక్కెర శోషణను నెమ్మదిస్తుంది, తద్వారా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. కాబట్టి ఇలా చేయడం వల్ల డయాబెటిస్ ను నియంత్రణలో ఉంచవచ్చు. అంతేకాదు జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. శీతాకాలంలో శరీరంలో వెచ్చదనాన్ని పెంచుతుంది.
4. ముల్లంగి (Radish)..
పోషకాలు: విటమిన్ సి, పొటాషియం, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
ప్రయోజనాలు ఏమిటంటే..? బీపీ అదుపు..పొటాషియం ఉండటం వల్ల రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. అంతేకాదు విటమిన్ సిరోగనిరోధక శక్తిని పెంచి, అలసటను తగ్గిస్తుంది. ముఖ్యంగా డీటాక్సిఫికేషన్.. కాలేయం (Liver), మూత్రపిండాలు (Kidneys) శుభ్రంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది.
5. బ్రకోలీ (Broccoli)..
పోషకాలు: విటమిన్ సి, విటమిన్ కె, ఐరన్, ఫైబర్, సల్ఫోరాఫేన్ (Sulforaphane) ఉంటాయి.
ప్రయోజనాలు ఏమిటంటే..?.. క్యాన్సర్ నిరోధకత: ఇందులో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలు కొన్ని రకాల క్యాన్సర్ కణాలతో పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఎముకలు, చర్మం.. విటమిన్ సి, కొల్లాజెన్ ఉత్పత్తికి సహాయపడుతుంది. ముఖ్యంగా అధిక ఫైబర్ జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది.
శీతాకాలంలో ఈ కూరగాయలను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా సీజనల్ వ్యాధుల బారీ నుంచి తప్పించుకోవచ్చు. సాధ్యమైనంత వరకు వీటిని కొద్దిగా ఉడికించి (లేదా సలాడ్ రూపంలో) తీసుకోవడం ద్వారా పోషకాలు నష్టపోకుండా ఉంటాయి.
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..థ్రోంబోసైట్లు అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..మార్నింగ్ వాక్ చేసేటపుడు ఈ ఆరు విషయాలు గుర్తుంచుకోండి..ఎందుకంటే..?
ఇలాంటి కచ్చితమైన ఆరోగ్య సమాచారాన్ని అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అందించే మరిన్ని విషయాలను గురించి మీరు తెలుసుకోవాలంటే సాక్షి లైఫ్ ను ఫాలో అవ్వండి..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com