85% Higher Cancer Risk Among People Living Alone : ఒంటరిగా ఉండేవారిలో క్యాన్సర్ వచ్చే ముప్పు 85శాతం.. ది కన్వర్సేషన్, కేంబ్రిడ్జ్ నివేదిక..
సాక్షి లైఫ్ : మనుషుల మధ్య అనుబంధాలు కేవలం మనసుకే కాదు, శరీర ఆరోగ్యానికి కూడా ఎంతో అవసరమని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. ముఖ్యంగా ఒంటరిగా ఉండేవారిలో క్యాన్సర్ వచ్చే ముప్పు అధికంగా ఉందని అమెరికాలోని 12 రాష్ట్రాల్లో 40 లక్షల మందిపై జరిపిన ఒక సమగ్ర విశ్లేషణలో వెల్లడైంది. వైవాహిక స్థితికి, ఆరోగ్యానికి మధ్య ఉన్న విడదీయలేని సంబంధాన్ని 'ది కన్వర్సేషన్, కేంబ్రిడ్జ్' నివేదిక స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..
ఇది కూడా చదవండి..Diabetes : డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి..?
ఇది కూడా చదవండి.. రసాయనాలతో పండిన పుచ్చకాయను ఎలా కనుక్కోవచ్చు..
నివేదికలోని విస్తుపోయే వాస్తవాలు..
పెళ్లయిన వారితో పోలిస్తే, ఒంటరిగా ఉండేవారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు గణనీయంగా ఉన్నాయి. పెళ్లికాని పురుషులకు క్యాన్సర్ ముప్పు 70శాతం ఎక్కువఉండగా. మహిళలలో: పెళ్లికాని మహిళల్లో ఈ ప్రమాదం ఏకంగా 85 శాతం ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇది వివాహం కేవలం పురుషులకే లాభదాయకమనే పాత నమ్మకాలను పటాపంచలు చేస్తోంది.
50 ఏళ్ల తర్వాత మరింత జాగ్రత్త..!
జీవనశైలిలో దశాబ్దాలుగా దొర్లే చిన్న చిన్న లోపాల ప్రభావం 50 ఏళ్ల వయస్సు తర్వాత స్పష్టంగా కనిపిస్తుంది. ఒంటరిగా ఉండేవారు ఆహారం, వ్యాయామం, క్రమం తప్పని వైద్య పరీక్షల పట్ల నిర్లక్ష్యంగా ఉండే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. ఈ అజాగ్రత్తే వయసు మళ్లిన తర్వాత క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తోంది. ఈ పరిశోధనలో 'హ్యూమన్ పాపిల్లోమావైరస్' (HPV) కి సంబంధించిన క్యాన్సర్ల గురించి కీలక విషయాలు తెలిశాయి.
పెళ్లికాని పురుషులలో ఆనల్ క్యాన్సర్ రేటు 5 రెట్లు ఎక్కువగా ఉంది. పెళ్లికాని మహిళల్లో సర్వైకల్ క్యాన్సర్ ముప్పు 3 రెట్లు అధికంగా ఉన్నట్లు తేలింది. సరైన సమయంలో వ్యాక్సినేషన్, క్రమబద్ధమైన స్క్రీనింగ్ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.
వైవాహిక జీవితం కవచంలా..
వైవాహిక జీవితం క్యాన్సర్ ముప్పును ఎలా తగ్గిస్తుందనే అంశంపై నిపుణులు కొన్ని సామాజిక కారణాలను విశ్లేషించారు. ఆరోగ్యం బాగోలేనప్పుడు లేదా క్రమం తప్పకుండా చెకప్స్ చేయించు కోవడంలో జీవిత భాగస్వామి ఇచ్చే ప్రోత్సాహం ఎంతో కీలకం. మెరుగైన ఆరోగ్య బీమా, ఉమ్మడి ఆర్థిక వనరులు వైద్య చికిత్సను సులభతరం చేస్తాయి. మానసిక ప్రశాంతత, ఒత్తిడి లేని జీవితం వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.
మన ఆరోగ్యం కేవలం జన్యువులపైనే కాదు, మన చుట్టూ ఉండి మనల్ని జాగ్రత్తగా చూసుకునే మనుషులపై కూడా ఆధారపడి ఉంటుంది. బలమైన సామాజిక సంబంధాలు, ఆత్మీయుల తోడు క్యాన్సర్ వంటి మహమ్మారిపై పోరాటంలో అజేయమైన కవచంలా పనిచేస్తాయి.
ఇది కూడా చదవండి.. షుగర్ ఉన్నవాళ్లు పైనాపిల్ తినకూడదా..?
ఇది కూడా చదవండి.. ఎసిడిటీని అంతమొందించే ఇంటి చిట్కాలు..
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
