A Breakthrough Therapy That Restores Gut Health: పేగులను తిరిగి ఆరోగ్యవంతంగా మార్చే అద్భుత చికిత్స : శాస్త్రవేత్తల ఘనత..
సాక్షి లైఫ్ : వయసు పెరిగే కొద్దీ జీర్ణశక్తి తగ్గడం, తిన్న ఆహారం అరగక పోవడం సహజమని చాలామంది సరిపెట్టుకుంటారు. కానీ, బలహీన పడిన పేగులను తిరిగి ఆరోగ్యవంతంగా మార్చే అద్భుత చికిత్సను శాస్త్రవేత్తలు అందుబాటులోకి తెచ్చారు. అదే 'కార్ టి-సెల్ థెరపీ' (CAR T-cell therapy). ఈ కొత్త ఆవిష్కరణతో పేగులు వాటంతట అవే నయం చేసుకునే శక్తిని పొందుతాయని పరిశోధనల్లో వెల్లడైంది.
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..
ఇది కూడా చదవండి..Aging symptoms : వృద్ధాప్య లక్షణాలు వేగంగా పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?
సమస్య ఎక్కడ వస్తోంది..?
మన జీర్ణవ్యవస్థలోని పేగుల లోపలి పొరను 'ఎపిథీలియం' అంటారు. ఆరోగ్యవంతుల్లో ఈ పొర ప్రతి 3 నుంచి 5 రోజులకు ఒకసారి పాత కణాలను తొలగించుకుని, కొత్త కణాలతో పునరుద్ధరించుకుంటుంది. అయితే.. వయసు పెరగడం వల్ల ఈ స్వీయ పునరుద్ధరణ ప్రక్రియ నెమ్మదిస్తుంది.
క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఇచ్చే రేడియేషన్ వల్ల కూడా ఈ కణాలు దెబ్బతింటాయి. దీనివల్ల పేగుల్లో వాపు పెరగడం, 'లీకీ గట్ సిండ్రోమ్' వంటి దీర్ఘకాలిక సమస్యలు తలెత్తుతాయి.
కార్ టి-సెల్ థెరపీ ఎలా పనిచేస్తుంది..?
ఈ చికిత్స విధానంలో శరీరంలోని రోగనిరోధక కణాలను (T-cells) ల్యాబ్‌లో మార్పు చేసి, పేగుల్లో పేరుకుపోయిన అరిగిపోయిన కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకునేలా చేస్తారు. ఆ పాత కణాలు తొలగి పోగానే, కొత్త కణాల ఉత్పత్తి వేగవంతమై పేగులు తిరిగి యవ్వన స్థితికి చేరుకుంటాయి.
పరిశోధనల్లో తేలిన నిజాలు..
ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు కనిపించాయి. చికిత్స తర్వాత ఎలుకల పేగులు వేగంగా మరమ్మత్తు చేసుకున్నాయి. ఆహారం నుంచి పోషకాలను గ్రహించే శక్తి పెరిగింది, ఫలితంగా జీర్ణక్రియ మెరుగుపడింది. ఒక్కసారి చికిత్స అందిస్తే దాని ప్రభావం దాదాపు ఏడాది పాటు కొనసాగినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.
భవిష్యత్తులో..
మానవ కణాలపై చేసిన ప్రాథమిక పరీక్షలు కూడా సత్ఫలితాలను ఇచ్చాయి. ముఖ్యంగా క్యాన్సర్ రోగులకు, జీర్ణ సంబంధిత వ్యాధులతో బాధపడే వృద్ధులకు ఈ థెరపీ ఒక వరంగా మారనుంది. పేగుల ఆరోగ్యాన్ని సహజ సిద్ధంగా మెరుగుపరిచే ఈ విధానం వైద్య రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలకనుంది.
ఇది కూడా చదవండి..Hormonal Imbalance : మహిళల్లో మానసిక సమస్యలకు హార్మోన్ల అసమతుల్యత మాత్రమే కారణం కాదు..!
ఇది కూడా చదవండి..China’s New Longevity Pill : ఆయువు పెంచే చైనా ఔషధంతో 150 ఏళ్లు బతకొచ్చా..?
ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
