Bixonimania : ఏఐ.. అంతా నిజం కాదా..? నకిలీ వ్యాధినీ నిజమని నమ్మిన చాట్‌బాట్లు..‘బిక్సోనిమేనియా’ ప్రయోగంలో విస్తుపోయే నిజాలు..

షేర్ చేయండి:
Bixonimania : ఏఐ.. అంతా నిజం కాదా..? నకిలీ వ్యాధినీ నిజమని నమ్మిన చాట్‌బాట్లు..‘బిక్సోనిమేనియా’ ప్రయోగంలో విస్తుపోయే నిజాలు..

సాక్షి లైఫ్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI).. నేడు ప్రపంచాన్ని శాసిస్తున్న సాంకేతికత. అడిగిందే తడవుగా సమాధానాలిచ్చే చాట్‌జీపీటీ, జెమిని వంటి ఏఐ నమూనాలు అన్నీ నిజాలే చెబుతాయని మనం గుడ్డిగా నమ్ముతుంటాం. కానీ, ఈ యంత్ర మేధ కూడా పచ్చి అబద్ధాలను నిజమని నమ్మే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తల ప్రయోగంలో తేలింది. లేని వ్యాధిని ఉన్నట్లుగా సృష్టించిన ‘బిక్సోనిమేనియా’ ఉదంతం ఇప్పుడు సాంకేతిక లోకాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది.

 

ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?

ఇది కూడా చదవండి..Latest study : పిల్లిని పెంచుకుంటే స్కిజోఫ్రెనియా ముప్పు రెట్టింపు..! 

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

 

‘బిక్సోనిమేనియా’అంటే ఏమిటి..?

నిజానికి ఇలాంటి వ్యాధి ప్రపంచంలోనే లేదు..! 2024లో కొంతమంది శాస్త్రవేత్తలు ఏఐ సామర్థ్యాన్ని పరీక్షించేందుకు ఒక నకిలీ పరిశోధనా పత్రాన్ని సృష్టించారు. కంప్యూటర్లను ఎక్కువగా వాడటం వల్ల ‘బిక్సోనిమేనియా’ అనే ప్రమాదకర కంటి వ్యాధి వస్తుందని అందులో పేర్కొన్నారు. రచయితల పేర్లు, సంస్థలు, నిధుల వివరాలతో సహా అన్నీ కల్పితమే. అయితే, విస్తుపోయేలా.. ఈ సమాచారాన్ని ధ్రువీకరించుకోకుండానే ప్రముఖ ఏఐ నమూనాలు దీనిని నిజమైన అనారోగ్యంగా ప్రపంచానికి పరిచయం చేయడం మొదలుపెట్టాయి.

నమ్మించేలా..!

ఏఐ వ్యవస్థలు కేవలం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న డేటా ఆధారంగా పనిచేస్తాయి. డేటా విశ్వసనీయంగా కనిపించినప్పుడు, అవి విచక్షణ కోల్పోయి తప్పుడు సమాచారాన్ని (Hallucination) కూడా వాస్తవమని భ్రమింపజేస్తాయి. కేంబ్రిడ్జ్ ఫెస్టివల్‌లో నిర్వహించిన ‘ది ట్రేటర్స్’ ప్రయోగం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. తప్పుడు సమాచారాన్ని కూడా ఆహార్యం, యాస, ప్రదర్శన శైలితో నమ్మించవచ్చని, మనుషులతో పాటు యంత్రాలు కూడా ఇలాంటి సంకేతాలకే మోసపోతాయని ఈ ప్రయోగం నిరూపించింది.

విమర్శనాత్మక ఆలోచనే రక్ష..!

ప్రస్తుత డిజిటల్ యుగంలో సమాచారం దొరకడం పెద్ద కష్టం కాదు, కానీ అందులో ఏది నిజం, ఏది అబద్ధం అని తేల్చుకోవడమే సవాలు. కేవలం విద్యావంతులైనంత మాత్రాన ఈ మోసాల నుంచి తప్పించుకోలేమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చదివిన ప్రతి విషయాన్ని గుడ్డిగా నమ్మకుండా, దాని వెనుక ఉన్న వాస్తవాలను సరిచూసుకోవాలి.

విమర్శనాత్మక ఆలోచన (Critical Thinking)..విద్యా వ్యవస్థలో కేవలం గణితం, సైన్స్ మాత్రమే కాదు.. సమాచారాన్ని విశ్లేషించే గుణాన్ని కూడా పెంపొందించుకోవాలి. సాంకేతికత ఎంత పెరిగినా, మానవ మేధస్సుతో కూడిన విచక్షణే అత్యుత్తమమైనది. ఏఐ ఇచ్చే సమాచారాన్ని ఒక పరికరంగా వాడుకోవాలి తప్ప, ప్రాణాధారమైన ఆరోగ్య విషయాల్లో దానిపైనే పూర్తి ఆధారపడటం ప్రమాదకరమని ‘బిక్సోనిమేనియా’ ఉదంతం మనకు హెచ్చరిక జారీ చేస్తోంది.

 

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?

ఇది కూడా చదవండి..High grade fever : హై గ్రేడ్ ఫీవర్ అంటే..? ఎందుకు వస్తుంది..?

ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.