Alzheimer’s : కంటిలోని రెటీనా ద్వారా ఏళ్ల ముందే అల్జీమర్స్‌ గుర్తింపు..!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : మనిషి మేధస్సును కబళించే అల్జీమర్స్ వ్యాధిని ఇకపై కంటి పరీక్షతోనే ఏళ్ల ముందే పసిగట్టవచ్చు. అమెరికాలోని హ్యూస్టన్ మెథడిస్ట్ ఆసుపత్రి పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనంలో ఈ ఆశాజనక విషయాలు వెల్లడయ్యాయి. మెదడుపై వ్యాధి ప్రభావం చూపకముందే, కంటిలోని రెటీనా ద్వారా ప్రాథమిక దశలోనే దీనిని గుర్తించే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..? 

ఇది కూడా చదవండి..Weight loss : బరువు తగ్గడం కోసం 'ఫేక్ ఫాస్టింగ్' ఉపయోగపడుతుందా..

 

కళ్లే 'మెదడుకు కిటికీలు'..

"కళ్లు మెదడుకు కిటికీలు వంటివి" అని ఈ పరిశోధనలో పాల్గొన్న స్టీఫెన్ వాంగ్ పేర్కొన్నారు. అయితే, ఇప్పటివరకు మనం ఆ కిటికీలోని తప్పుడు భాగాన్ని చూస్తున్నామని ఆయన అభిప్రాయపడ్డారు. సాధారణంగా కంటి పరీక్షలు రెటీనా మధ్యభాగంపై దృష్టి పెడతాయి. కానీ, అల్జీమర్స్‌కు సంబంధించిన తొలి సంకేతాలు రెటీనా బయటి భాగంలో (Outer Retina) దాగి ఉంటాయని ఈ తాజా పరిశోధన నిరూపించింది.

జ్ఞాపకశక్తి తగ్గకముందే చికిత్స.. 

ఈ ఆవిష్కరణ వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం.. సాధారణంగా అల్జీమర్స్ బారిన పడిన వారికి జ్ఞాపకశక్తి క్షీణించిన తర్వాతే వ్యాధి నిర్ధారణ అవుతుంది. అప్పటికే మెదడులోని నరాలు చాలా వరకు దెబ్బతింటాయి. కానీ, ఈ కొత్త పద్ధతి ద్వారా మెదడు దెబ్బతినడానికి చాలా ఏళ్ల ముందే రెటీనాలో వచ్చే మార్పులను గుర్తించవచ్చు. క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించు కోవడం ద్వారా వైద్యులు ఈ మార్పులను పసిగట్టి, వ్యాధి ముదరక ముందే చికిత్స ప్రారంభించే అవకాశం ఉంటుంది.

ఏమిటా సైన్స్..?

అల్జీమర్స్ వ్యాధికి ప్రధాన కారణం మెదడులో 'అమిలాయిడ్ ప్రోటీన్' (Amyloid Protein) పేరుకుపోవడం. సరిగ్గా ఇదే తరహా ప్రోటీన్ కంటిలోని రెటీనాలో కూడా జమ అవుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అంటే, రెటీనాలో జరిగే మార్పులు మెదడు లోపల జరుగుతున్న అనారోగ్య పరిస్థితికి అద్దం పడతాయన్నమాట. జ్ఞాపకశక్తిలో మార్పులు రాకముందే కంటి వైద్యుడిని సంప్రదించి రెటీనా పరీక్షలు చేయించుకోవడం భవిష్యత్తులో అల్జీమర్స్ ముప్పును తగ్గించడంలో కీలకం కానుంది.

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..? 

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..Shock for Tattoo Lovers..! టాటూస్ తో 29శాతం స్కిన్ క్యాన్సర్ ముప్పు..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.