చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే నల్ల ద్రాక్ష..
సాక్షి లైఫ్ : నల్ల ద్రాక్షలో ఆంథోసైనిన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది వాటికి ముదురు రంగును ఇస్తుంది. ఈ యాంటీఆక్సిడెంట్ శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయ పడుతుంది, తద్వారా క్యాన్సర్, గుండె జబ్బులు, ఇతర తీవ్రమైన అనారోగ్యాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతే కాకుండా నల్ల ద్రాక్షలో రెస్వెరాట్రాల్ అనే ఎంజైమ్ కూడా ఉంటుంది.
ఇది కూడా చదవండి.. ఆరోగ్యంగా ఉన్నవాళ్లకు ప్రోటీన్ సప్లిమెంట్లు అవసరంలేదంటున్న వైద్యులు..
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
ఇది గుండె ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో రక్తం గడ్డకట్టకుండా నిరోధించడంలో సహాయ పడుతుంది. నల్ల ద్రాక్షలో విటమిన్ కె, విటమిన్ సి, ఫైబర్, పొటాషియం కూడా పుష్కలంగా లభిస్తాయి. విటమిన్ కె బలమైన ఎముకలను నిర్మించడంలో సహాయపడుతుంది. విటమిన్ సి రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది, ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పొటాషియం రక్తపోటును నియంత్రించ డంలో సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
