Detect the Deadly Disease : కాలేయాన్ని కాటు వేసే మహమ్మారిని గుర్తించే సరికొత్త ఆవిష్కరణ..

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : కాలేయానికి ప్రాణాంతకంగా మారే హెపటైటిస్-బి వైరస్‌ను గుర్తించడం ఇకపై మరింత సులభం కానుంది. సాధారణంగా ఈ వ్యాధి నిర్ధారణ కోసం పెద్ద పెద్ద ల్యాబొరేటరీలు, ఖరీదైన యంత్రాలు, రోజుల కొద్దీ నిరీక్షణ తప్పనిసరి. కానీ, ఆస్ట్రేలియాకు చెందిన కిర్బీ ఇన్‌స్టిట్యూట్ పరిశోధకులు ఇప్పుడు ఒక విప్లవాత్మక 'ఫింగర్‌స్టిక్' (Fingerstick) పరీక్షను అందుబాటులోకి తెచ్చారు.

 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..? 

ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే.. 

 

ఆస్ట్రేలియాలో ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రయల్ హెపటైటిస్ బి డి ఎన్ ఏ కు సంబంధించిన ఒక సాధారణ ఫింగర్‌స్టిక్ పరీక్ష అనేది ప్రామాణిక ప్రయోగశాల పరీక్ష వలె ఖచ్చితమైనదని, మారుమూల ప్రాంతాలలో ఎక్కువ మందికి ప్రయోజనం కలుగుతుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.


ఏమిటీ ప్రత్యేకత ఏమిటంటే..?

ప్రస్తుతం అందుబాటులో ఉన్న పద్ధతుల్లో సిరల నుంచి రక్తాన్ని సేకరించి ల్యాబ్‌కు పంపాల్సి ఉంటుంది. కానీ ఈ కొత్త విధానంలో డయాబెటిస్ పరీక్షలాగే వేలిపై చిన్న సూదితో గుచ్చి, ఒక చుక్క రక్తంతో పరీక్ష నిర్వహించవచ్చు. దీని కోసం రోజుల తరబడి వేచి చూడక్కర్లేదు. కేవలం 60 నిమిషాల్లోనే ఫలితం వెల్లడవుతుంది. ఈ పాయింట్ ఆఫ్ కేర్ (POC) పరీక్షా ఫలితాలు, ఖరీదైన ల్యాబ్ పరీక్షలతో సమానమైన కచ్చితత్వాన్ని (Accuracy) కలిగి ఉన్నట్లు క్లినికల్ ట్రయల్స్‌లో తేలింది.

ఎందుకు ముఖ్యం అంటే..?

ప్రపంచవ్యాప్తంగా దాదాపు 25.4 కోట్ల మంది ఈ వైరస్‌తో బాధపడుతుంటే, అందులో కేవలం 10 శాతం మందికి మాత్రమే తమకు ఇన్ఫెక్షన్ ఉందనే విషయం తెలుస్తోంది. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ఉండేవారికి సరైన పరీక్షా కేంద్రాలు అందుబాటులో లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఈ కొత్త విధానం వల్ల మారుమూల గ్రామాల్లో సైతం సులభంగా పరీక్షలు నిర్వహించి, వెంటనే చికిత్స ప్రారంభించే అవకాశం ఉంటుంది" అని పరిశోధనకు నాయకత్వం వహించిన ప్రొఫెసర్ గెయిల్ మాథ్యూస్ తెలిపారు.

సకాలంలో గుర్తిస్తే..

హెపటైటిస్-బి ని సకాలంలో గుర్తిస్తే కాలేయం దెబ్బతినకుండా (Cirrhosis), కాలేయ క్యాన్సర్ బారిన పడకుండా ప్రాణాలు కాపాడుకోవచ్చు. 2030 నాటికి హెపటైటిస్-బి రహిత ప్రపంచాన్ని నిర్మించాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) లక్ష్యానికి ఈ ఆవిష్కరణ పెద్ద ఊతాన్నిస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి..Tamarind : మైక్రోప్లాస్టిక్స్‌ ముప్పును తొలగించే అస్త్రం.. 'చింతపండు'.. తాజా పరిశోధనలో వెల్లడి..

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.