పలు టూత్ పేస్ట్ బ్రాండ్లలో ప్రమాదకరమైన లోహాలు..
సాక్షి లైఫ్ : ప్రతిరోజూ మనం ఉపయోగించే టూత్‌పేస్ట్‌లో ప్రమాదకర హెవీ మెటల్స్ ఉన్నాయని తాజా అధ్యయనం షాకింగ్ విషయాలను వెల్లడించింది. ప్రముఖ టూత్‌పేస్ట్ బ్రాండ్లలో సీసం (లెడ్), ఆర్సెనిక్, కాడ్మియం, మెర్క్యురీ వంటి విషపూరిత లోహాలు ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ హెవీ మెటల్స్ మన శరీరంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని వారు హెచ్చరిస్తున్నారు. ఈ లోహాలు ఏమిటి? అవి మన ఆరోగ్యాన్ని ఎలా దెబ్బతీస్తాయి? తెలుసుకుందాం..!
ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..
ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..
ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?
హెవీ మెటల్స్ ఏమిటి..?
సీసం, ఆర్సెనిక్, కాడ్మియం, మెర్క్యురీ వంటి హెవీ మెటల్స్ సహజంగా లభిస్తాయి, కానీ అవి అధికంగా శరీరంలో చేరితే తీవ్ర ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. ఈ లోహాలు టూత్‌పేస్ట్ తయారీలో ఉపయోగించే కొన్ని రసాయనాలు లేదా ముడిసరుకు నీటి ద్వారా కలుషితమై ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.
శరీరంపై ప్రభావం ఏమిటి..?
సీసం (లెడ్) : నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. పిల్లలలో మెదడు అభివృద్ధికి ఆటంకం కలిగిస్తుంది, పెద్దలలో రక్తపోటు, కిడ్నీ సమస్యలను తెస్తుంది. ఆర్సెనిక్ : చర్మ సమస్యలు, గుండె జబ్బులు, క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. కాడ్మియం : కిడ్నీలు, ఎముకలపై దుష్ప్రభావం చూపిస్తుంది. దీర్ఘకాలంలో క్యాన్సర్‌కు కారణమవుతుంది. మెర్క్యురీ : నాడీ వ్యవస్థ, మెదడు, కిడ్నీలను దెబ్బతీస్తుంది. గర్భిణీ స్త్రీలకు ఇది మరింత ప్రమాదకరం.
ఇది కూడా చదవండి..కాలేయ వ్యాధులు ఎన్ని రకాలు..? ఏవి ప్రమాదకరం..?
ఇది కూడా చదవండి..చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే పైనాపిల్ జ్యూస్..
ఇది కూడా చదవండి..హెల్త్ : విటమిన్ B12 పెంచే టాప్ 5 ఆహారాలు..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
