Experiment Successful : ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు సరికొత్త పరిష్కారం..    

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : అత్యంత ప్రమాదకరమైన ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కు చికిత్స అందించడంలో వైద్య రంగం సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ప్రాణాంతకంగా భావిస్తున్న ఈ వ్యాధిని ఎలుకల్లో పూర్తిగా నయం చేయడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. మూడు రకాల ఔషధాల కలయికతో కూడిన 'ట్రిపుల్ కాంబినేషన్ థెరపీ' (Triple Combination Therapy) ద్వారా క్యాన్సర్ కణతులను పూర్తిగా కరిగించడమే కాకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చేయడం విశేషం. స్పెయిన్‌కు చెందిన నేషనల్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ (CNIO) శాస్త్రవేత్త మరియానో బార్బాసిడ్ నేతృత్వంలోని బృందం ఈ అద్భుతాన్ని సాధించింది.

 

ఇది కూడా చదవండి..టిపికల్ ఫీవర్స్ అంటే ఏమిటి..? వాటి లక్షణాలు ఎలా ఉంటాయి..?

ఇది కూడా చదవండి.. ఎలాంటి ఆసనాలు, ముద్రలు వేస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది..?

ఇది కూడా చదవండి.. మీరు ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే..? 

 

ఎలా సాధ్యమైంది..?

ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కణాలు చాలా మొండివి. సాధారణంగా ఒక మందు వాడితే అవి త్వరగా రూపాంతరం చెంది దాన్ని తట్టుకుంటాయి. అందుకే శాస్త్రవేత్తలు KRAS అనే ప్రమాదకరమైన జన్యువును టార్గెట్ చేస్తూ మూడు వైపుల నుంచి దాడి చేశారు. డరాక్సోన్రాసిబ్ (Daraxonrasib)..ఇది KRAS జన్యువు పనితీరును అడ్డుకుంటుంది. అఫాటినిబ్ (Afatinib)..ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు వాడే ఈ మందును ఇందులో ఉపయోగించారు. SD36 (Protein Degrader)..ఇది క్యాన్సర్ కణాల మనుగడకు అవసరమైన ప్రోటీన్లను నాశనం చేస్తుంది.

 కణితులు పూర్తిగా మాయం..

ఎలుకల్లో ప్రయోగించినప్పుడు క్యాన్సర్ కణతులు శాశ్వతంగా అదృశ్యమయ్యాయి.  చికిత్స తర్వాత దాదాపు 200 రోజులకు పైగా పరిశీలించినా, క్యాన్సర్ మళ్లీ తిరిగి రాలేదు. సాధారణంగా క్యాన్సర్ మందుల వల్ల ఉండే విషతుల్య ప్రభావాలు (Toxicity) ఇందులో కనిపించలేదు. ఎలుకల పైనే కాకుండా, మనుషుల నుంచి సేకరించిన క్యాన్సర్ కణజాలం (Patient-derived Xenografts) పై కూడా ఈ థెరపీ అద్భుతంగా పనిచేసింది.

 అందుబాటులోకి వచ్చేది ఎప్పుడు మరి..?

ఈ అధ్యయనంలోని ఫలితాలు PNAS (Proceedings of the National Academy of Sciences) జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం ఎలుకలపై ప్రయోగం విజయవంతమైనప్పటికీ, మనుషులపై క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించడానికి ఇంకా కొంత సమయం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది క్యాన్సర్ పై యుద్ధంలో కీలక మలుపు కానుంది. మనుషులకు కూడా ఈ చికిత్స సురక్షితమని తేలితే.. క్లోమ గ్రంథి క్యాన్సర్ మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. 

ఇది కూడా చదవండి..అధిక బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని క్యాలరీలు బర్న్ అవ్వాలి..?

ఇది కూడా చదవండి..రోజూ బెల్లం తింటే బరువు పెరుగుతారా..? 

ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.