Latest Study : శరీరంలో కొవ్వు పెరిగితే.. మెదడు నరాలు బలహీనపడతాయా..?
సాక్షి లైఫ్ : సాధారణంగా శరీరంలో కొవ్వు పెరిగితే గుండె జబ్బులు వస్తాయని భయపడతాం. కానీ, ఈ కొవ్వుల సమతుల్యత (Lipid Balance) తప్పితే నేరుగా మెదడులోని నరాల వ్యవస్థపైనే ప్రభావం పడుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వయసు పైబడిన వారిలో ఇది 'పార్కిన్సన్స్' వంటి తీవ్రమైన మెదడు వ్యాధులకు దారితీసే ప్రమాదం ఉందని తాజా అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇది కూడా చదవండి..ఓఆర్ఎస్ ఆరోగ్యానికి మంచిదేనా..? ఎనర్జీ డ్రింక్స్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు..?
ఇది కూడా చదవండి..విటమిన్ సి లోపించినప్పుడు కనిపించే ముఖ్య లక్షణాలు ఇవే..
ఇది కూడా చదవండి..ఒత్తిడి, ఆందోళనను తగ్గించడానికి బెస్ట్ ఫుడ్ ఏది..?
కొవ్వుకు.. మెదడుకు సంబంధం ఏంటి..?
మన మెదడులో అత్యధిక భాగం కొవ్వుతోనే నిర్మితమై ఉంటుంది. నరాల కణాల (Neurons) మధ్య సమాచార మార్పిడి సజావుగా సాగాలన్నా, కణాల చుట్టూ ఉండే రక్షణ పొరలు ఆరోగ్యంగా ఉండాలన్నా సరైన మోతాదులో లిపిడ్లు అవసరం. అయితే.. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ (LDL) పెరగడం వల్ల మెదడుకు రక్తప్రసరణ తగ్గుతుంది. ఇది క్రమంగా నరాల క్షీణతకు (Neurodegeneration) కారణమవుతుంది.
శరీరంలో కొవ్వుల జీవక్రియ దెబ్బతిన్నప్పుడు, మెదడులో 'ఆల్ఫా-సినూక్లిన్' అనే ప్రోటీన్ అసాధారణంగా పేరుకుపోతుంది. ఇదే పార్కిన్సన్స్ వ్యాధికి ప్రధాన సంకేతం.
పార్కిన్సన్స్ ముప్పు ఎలా పెరుగుతుంది..?
శరీరంలో కొవ్వు పరిమాణం అస్తవ్యస్తమైతే, అది మెదడులోని 'డోపమైన్'ను ఉత్పత్తి చేసే కణాలను దెబ్బతీస్తుంది. డోపమైన్ తగ్గడం వల్ల చేతులు వణకడం, నడకలో స్థిరత్వం కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అధిక కొవ్వు వల్ల శరీరంలో కలిగే 'ఇన్ఫ్లమేషన్' మెదడులోని రక్షణ కణాలను బలహీనపరుస్తుంది. దీనివల్ల జ్ఞాపకశక్తి మందగించి, ఆలోచనా శక్తి తగ్గుతుంది.
నివారణ మార్గాలు ఏంటి మరి..?
మెదడు నరాలను పదిలంగా ఉంచుకోవాలంటే ఆహారపు అలవాట్లలో మార్పులు తప్పనిసరని వైద్యులు సూచిస్తున్నారు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉండే చేపలు, వాల్‌నట్స్, బాదం వంటివి మెదడుకు రక్షణ కవచంలా పనిచేస్తాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో కొవ్వు కరిగి, మెదడుకు ఆక్సిజన్‌తో కూడిన రక్తప్రసరణ మెరుగుపడుతుంది. నూనెలో వేయించిన పదార్థాలు, బేకరీ ఫుడ్స్‌లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ మెదడు పనితీరును మందగింపజేస్తాయి.
ఇది కూడా చదవండి..బ్లడ్ క్యాన్సర్ ను గుర్తించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారు..?
ఇది కూడా చదవండి..డిప్రెషన్ ఉన్న వారిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..రాత్రి 9 గంటల తర్వాత డిన్నర్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఇవే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
