Liver Diseases in Non-Drinkers : మద్యం సేవించని వారికీ కాలేయ వ్యాధులు.. తాజా పరిశోధనలో ఆసక్తికర అంశాలు.. 

షేర్ చేయండి:
Liver Diseases in Non-Drinkers : మద్యం సేవించని వారికీ కాలేయ వ్యాధులు.. తాజా పరిశోధనలో ఆసక్తికర అంశాలు.. 

సాక్షి లైఫ్ : మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా నేడు ప్రతి పది మంది భారతీయుల్లో ముగ్గురు 'నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్' (NAFLD) సమస్యతో సతమతమవుతున్నారు. మద్యం సేవించకపోయినా కాలేయంలో కొవ్వు పేరుకుపోయే ఈ మొండి వ్యాధికి విటమిన్ బి-3 అంటే నియాసిన్ ఒక అద్భుతమైన పరిష్కారమని దక్షిణ కొరియా శాస్త్రవేత్తలు గుర్తించారు.

 

ఇది కూడా చదవండి..Revisiting Old Books: మానసిక ఆరోగ్యానికి ' చదివిన పుస్తకాలు మళ్లీ చదవడం' దివ్యౌషధం..

ఇది కూడా చదవండి..Anti-Aging Strategies : జీవ గడియారాన్ని వెనక్కి తిప్పే శాస్త్రీయ మార్గాలు..?

ఇది కూడా చదవండి..Aging symptoms : వృద్ధాప్య లక్షణాలు వేగంగా పెరగడానికి ప్రధాన కారణాలు ఏమిటి..?

 

ఏమిటీ మైక్రో ఆర్ఎన్ఏ-93..?

దక్షిణ కొరియాలోని ఉల్సాన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో 'మైక్రో ఆర్ఎన్ఏ-93' అనే అణువు కాలేయ వ్యాధిలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తేలింది. సాధారణంగా ఫ్యాటీ లివర్ బాధితుల్లో ఈ అణువు స్థాయిలు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ఇది కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 'SIRT1' అనే ప్రయోజనకర జన్యువు పనితీరును అడ్డుకుంటుంది. ఫలితంగా కాలేయంలో కొవ్వు పేరుకుపోయి.. వాపు, మచ్చలు (Scarring) ఏర్పడి కాలేయ పనితీరు మందగిస్తుంది.

నియాసిన్ (B3)..

సుమారు 150 రకాల మందులను పరీక్షించిన అనంతరం, శాస్త్రవేత్తలు విటమిన్ బి-3 అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తున్నట్లు కనుగొన్నారు. ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో విటమిన్ బి-3 సప్లిమెంట్లు ఇవ్వడం వల్ల మైక్రో ఆర్ఎన్ఏ-93 స్థాయిలు తగ్గి, SIRT1 జన్యువు తిరిగి చురుగ్గా మారింది. దీనివల్ల కాలేయంలోని కొవ్వు కరగడమే కాకుండా, ఇన్సులిన్ సున్నితత్వం మెరుగుపడి కాలేయ ఆరోగ్యం కుదుటపడింది. ఫ్యాటీ లివర్ వ్యాధిగ్రస్తులకు విటమిన్ బి3 అధికంగా ఉండే ఆహారం లేదా వైద్యుల సలహాతో తీసుకునే సప్లిమెంట్లు తక్కువ ఖర్చుతో కూడిన మేలైన చికిత్స కాగలవని పరిశోధకులు భావిస్తున్నారు.

సహజంగా విటమిన్ బి3 లభించే ఆహారాలు.. 

కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మన నిత్యం తీసుకునే ఆహారంలో వీటిని చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముడి బియ్యం, గోధుమలు వంటి తృణధాన్యాలు, వేరుశనగలు, పొద్దుతిరుగుడు గింజలు, పుట్టగొడుగులు (Mushrooms), బఠానీలు, ఆకుకూరలు. చికెన్ బ్రెస్ట్, చేపలు, గుడ్లు వంటివాటిలో బి3 లభిస్తుంది.

 

ఇది కూడా చదవండి..China’s New Longevity Pill : ఆయువు పెంచే చైనా ఔషధంతో 150 ఏళ్లు బతకొచ్చా..?

ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

 


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.