New Treatment for Colon Cancer : కొలన్ క్యాన్సర్‌కు సరికొత్త చికిత్స.. నిట్‌ రూర్కెలా పరిశోధకుల ఆవిష్కరణ.!

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : కొలన్ (పెద్ద పేగు) క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు తీసుకురాగల కీలక ఆవిష్కరణను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT), రూర్కెలా పరిశోధకులు కనుగొన్నారు. సాధారణంగా మనం ఉపయోగించే పిప్పళ్ళ (Long Pepper) మొక్కలోని ఒక సమ్మేళనం (Compound) కొలన్ క్యాన్సర్ కణాలను సమర్థవంతంగా చంపుతుందని ప్రయోగశాల పరీక్షల్లో (In Lab Testing) రుజువైంది. ప్రస్తుతం వాడుకలో ఉన్న కీమోథెరపీ (Chemotherapy) చికిత్సలతో పోలిస్తే ఇది తక్కువ ఖర్చుతో కూడిన ప్రత్యామ్నాయంగా మారే అవకాశం ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి.. రాత్రి భోజనం తర్వాత నడిస్తే.. ప్రయోజనాలివే.. 

 ఇది కూడా చదవండి.. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాల మధ్య వ్యత్యాసం..?

ఇది కూడా చదవండి.. ప్రపంచవ్యాప్తంగా హైపర్‌టెన్షన్‌ బాధితులు వీళ్లే.. 

 ఆవిష్కరణ వివరాలు.. 'పైపర్‌లాంగమిన్‌' శక్తి..  

ఎన్ఐటీ రూర్కెలా పరిశోధన బృందం పిప్పళ్ళ (దీని శాస్త్రీయ నామం Piper longum) లోని 'పైపర్‌లాంగమిన్‌' (Piperlongumine) అనే సమ్మేళనాన్ని వేరు చేసింది. ఈ సమ్మేళనం కొలన్ క్యాన్సర్ కణాలపై మాత్రమే దాడి చేసి, వాటిని చంపుతుందని, అదే సమయంలో ఆరోగ్యకరమైన కణాలకు ఎటువంటి నష్టం కలిగించదని పరీక్షల్లో తేలింది.

 ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) నివేదిక ప్రకారం, 2022లో సుమారు 1.9 మిలియన్ల కొత్త కొలన్ క్యాన్సర్ కేసులు నమోదయ్యాయి, 9 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. కీమోథెరపీ చికిత్స వల్ల జుట్టు రాలడం, అలసట, బలహీనత వంటి దుష్ప్రభావాలు ఉంటాయి. కానీ, 'పైపర్‌లాంగమిన్‌' ఈ దుష్ప్రభావాలను గణనీయంగా తగ్గిస్తుందని భావిస్తున్నారు.

పరిశోధన బృందం: ఎన్ఐటీ రూర్కెలాకు చెందిన ప్రొఫెసర్ బిమలేష్ కుమార్ బిస్వాల్ నేతృత్వంలోని బృందం ఈ అధ్యయనాన్ని విజయవంతంగా పూర్తి చేసింది.

  మరికొన్ని పరిశోధనలు జరగాల్సి ఉంది.. 

ఈ సమ్మేళనం వల్ల దుష్ప్రభావాలు చాలా తక్కువగా ఉండవచ్చని, చికిత్స ఖర్చు కూడా తగ్గుతుందని పరిశోధకులు ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుతం, ఈ 'పైపర్‌లాంగమిన్‌'ను కీమోథెరపీ మందులతో కలిపి ఉపయోగించడం ద్వారా రోగులు వేగంగా కోలుకోవడానికి ఎలా దోహదపడుతుందనే అంశంపై తదుపరి పరిశోధనలు (Next Level Research) చేపట్టనున్నట్లు వారు తెలిపారు. ఈ పరిశోధన విజయవంతమైతే, క్యాన్సర్ చికిత్స రంగంలో భారతదేశం నుంచి ఇది ఒక గొప్ప ముందడుగు అవుతుంది.

 

ఇది కూడా చదవండి.. ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి..?  

ఇది కూడా చదవండి.. టాటూ వేయించుకున్న వాళ్లు రక్తదానంచేయకూడదా..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.