National Statistics Reveal : పట్టణాలు.. పల్లెల్లో రెట్టింపైన రోగుల సంఖ్య.. భారీగా పెరిగిన వైద్య ఖర్చులు: నేషనల్ స్టాటిటిక్స్ లో వెల్లడి..
సాక్షి లైఫ్ : దేశంలో సామాన్యుడి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది. గతంతో పోలిస్తే అస్వస్థతకు గురవుతున్న వారి సంఖ్య దాదాపు రెట్టింపు కాగా, చికిత్స కోసం జేబులు గుల్ల చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జాతీయ గణాంక కార్యాలయ (NSO) తాజా సర్వే ప్రకారం.. 2018లో అనారోగ్యంతో బాధపడే వారి సంఖ్య 7.5 శాతంగా ఉండగా, 2025 నాటికి అది ఏకంగా 13.1 శాతానికి పెరిగింది. అంటే ప్రతి ఎనిమిది మంది భారతీయుల్లో ఒకరు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.
ఇది కూడా చదవండి..లవ్ హార్మోన్ అంటే ఏమిటి..?
ఇది కూడా చదవండి..ఎలాంటి కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి హానికరం..?
ఇది కూడా చదవండి..Latest study : పిల్లిని పెంచుకుంటే స్కిజోఫ్రెనియా ముప్పు రెట్టింపు..!
ఇది కూడా చదవండి.. క్షయవ్యాధి ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది..?
పట్టణాలు.. పల్లెలు.. ఎక్కడైనా అదే పరిస్థితి..
గ్రామీణ ప్రాంతాల్లో అనారోగ్య రేటు 6.8% నుండి 12.2శాతానికి పెరగగా, పట్టణాల్లో ఇది 9.1శాతం నుంచి 14.9శాతానికి చేరింది. పురుషుల 11.8శాతం కంటే మహిళలే 14.4శాతం ఎక్కువగా జబ్బుల బారిన పడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా వయసు పెరిగే కొద్దీ ఈ సమస్య తీవ్రమవుతోంది. 60 ఏళ్లు పైబడిన వారిలో దాదాపు 43.9 శాతం మంది ఏదో ఒక ఆరోగ్య సమస్యతో సతమతమవు తున్నారని సర్వేలో వెల్లడైంది.
భరించలేని భారం..
అనారోగ్యమే కాకుండా, చికిత్సకు అయ్యే ఖర్చు (Out of pocket expenditure) సామాన్యుడి నడ్డి విరుస్తోంది. ఒక్కో ఆసుపత్రి చేరికపై సగటు ఖర్చు గత ఏడేళ్లలో 70 శాతం పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో.. 2017-18లో రూ. 16,676 గా ఉన్న సగటు వైద్య ఖర్చు, ప్రస్తుతం రూ. 31,484కు చేరింది అంటే 88.8శాతం పెరిగింది. పట్టణ ప్రాంతాల్లో.. గతంలో రూ. 26,475 ఉండగా, ఇప్పుడు అది రూ. 38,688కి పెరిగింది. జాతీయ స్థాయిలో సగటున ఒక వ్యక్తి ఆసుపత్రిలో చేరితే రూ. 34,064 ఖర్చవుతోంది.
భీమా పథకాలు..
పెరుగుతున్న ఖర్చుల మధ్య ప్రభుత్వ ఆరోగ్య భీమా పథకాలు పేదలకు కొంత ఊరటనిస్తున్నాయి. గత దశాబ్ద కాలంలో భీమా పరిధి గణనీయంగా పెరిగింది. 2017-18లో కేవలం 14శాతం ఉన్న గ్రామీణ భీమా పరిధి ఇప్పుడు 47శాతానికి, పట్టణాల్లో 19శాతం నుంచి 44శాతానికి పెరగడం గమనార్హం. అయినప్పటికీ, మందుల ఖర్చులు, రోగ నిర్ధారణ పరీక్షల భారం నేటికీ మధ్యతరగతి కుటుంబాలను ఆర్థికంగా కుంగదీస్తోంది.
ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?
ఇది కూడా చదవండి..High grade fever : హై గ్రేడ్ ఫీవర్ అంటే..? ఎందుకు వస్తుంది..?
ఇది కూడా చదవండి..వేగంగా బరువు తగ్గించే ఓట్జెంపిక్ డ్రింక్ ట్రెండ్.. డైటీషియన్లు ఏమంటున్నారంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
