ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల కాలేయానికి ముప్పు..
సాక్షి లైఫ్ : గత కొన్ని దశాబ్దాలుగా మన ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణంగా పిజ్జా, బర్గర్, సమోసా, కచోరి వంటి ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలపై ఆధారపడటం పెరిగింది. ఈ రకమైన ఆహారం తీసుకోవడం వల్ల కాలేయంలో ఐదు శాతం కంటే ఎక్కువ కొవ్వు పేరుకుపోతుంది. ఈ కొవ్వు కారణంగా కాలేయ కణాలలో ఇన్ఫ్లమేషన్ మొదలవుతుంది. ఈ పరిస్థితిని నియంత్రించకపోతే, అది క్రమంగా ఫైబ్రోసిస్, తరువాత సిర్రోసిస్, చివరగా ప్రాణాంతకమైన కాలేయ క్యాన్సర్ గా మారుతుంది.
ఇది కూడా చదవండి..సీతాఫలం చర్మానికి ఎలాంటి మేలు చేస్తుంది..?
ఇది కూడా చదవండి..వయసును బట్టి కూడా క్యాన్సర్ లక్షణాల్లో మార్పులు కనిపిస్తాయా..?
ఇది కూడా చదవండి.. సాల్మన్ చేప ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి..?
పరిశోధనలో..
2022 నుంచి 2024 వరకు ఎయిమ్స్ లో 250 మంది వ్యక్తులపై నిర్వహించిన ఈ అధ్యయనం ఫలితాలు ఇటీవల నేచర్ జర్నల్ సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ప్రచురితమయ్యాయి. నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) ఉన్నవారిలో కాలేయ కణాల్లోని కొవ్వు ఇన్ఫ్లమేషన్ ను ప్రేరేపిస్తుందని, ఇది ఫైబ్రోసిస్‌కు దారితీస్తుందని ఈ పరిశోధన స్పష్టం చేసింది. అయితే ప్రోటీన్ ఈ ప్రక్రియను అడ్డుకుంటుందని తేలింది.
మనం మంచి పోషకాహారం తీసుకోవడం ద్వారా, ముఖ్యంగా ప్రోటీన్ ఉండే ఆహారాన్ని ఎంచుకోవడం ద్వారా కాలేయ క్యాన్సర్‌ను నివారించవచ్చని ఈ అధ్యయనంలో తేలింది. ప్రాసెస్ చేసిన ఆహారానికి దూరంగా ఉండటం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం మన కాలేయాన్ని రక్షించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి.. For health : కుంకుమ పువ్వు"టీ"తో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..?
ఇది కూడా చదవండి.. డయాబెటీస్ కు ప్రధాన కారణాలు ఏంటి..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
