మొక్కల ఆధారిత ఆహారం ఎంత ఉపయోగమో తెలుసా..?  

సాక్షిలైఫ్: స్లీప్ అప్నియా: మొక్కల ఆధారిత ఆహారాన్ని అనుసరించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆరోగ్య నిపుణులు చాలాసార్లు చెప్పారు. మొక్కల ఆధారిత ఆహారం గుండె, మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో చాలా సహాయపడుతుంది. అయితే ఇది స్లీప్ అప్నియా సమస్యను నివారించడంలో కూడా సహాయపడుతుందని మీకు తెలుసా..? అవును, ఈ విషయం తాజా అధ్యయనంలో వెల్లడైంది. స్లీప్ అప్నియా సమస్యను నివారించడంలో మొక్కల ఆధారిత ఆహారం ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.

అధ్యయనంలో ఏమి తేల్చారు..?  

ఈఆర్జే ఓపెన్ రీసెర్చ్‌లో ప్రచురించిన ఈ అధ్యయనంలో ఎక్కువ పండ్లు, కూరగాయలు, గింజలు, తృణధాన్యాలు కలిగిన ఆహారం తీసుకున్న వారిలో స్లీప్ అప్నియా ప్రమాదం గణనీయంగా తగ్గిస్తుంది. మొక్కల ఆధారిత ఆహారాన్ని అనుసరించే వ్యక్తులకు స్లీప్ అప్నియా వచ్చే ప్రమాదం 19 శాతం కంటే తక్కువగా ఉందని, ప్రాసెస్ చేసిన ధాన్యాలు, ఎక్కువ వేయించిన ఆహారాలు, ఎక్కువ ఉప్పు, చక్కెర ఉన్న ఆహారాలు వంటి అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునే వ్యక్తులలో ఈ సమస్య ఎక్కువగా వస్తుందని ఈ అధ్యయనం తేల్చింది. మొక్కల ఆధారిత ఆహారాన్ని తినే వారికి స్లీప్ అప్నియా వచ్చే ప్రమాదం 22 శాతం ఉంటుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. 

 కారణం ఏమిటి.. ?

మొక్కల ఆధారిత ఆహారం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉండటమే దీనికి ఒక కారణమని పరిశోధకులు చెబుతున్నారు. అధిక బరువు , స్లీప్ అప్నియాకు ప్రధాన కారణమని, మొక్కల ఆధారిత ఆహారం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.

స్లీప్ అప్నియా లక్షణాలు..?

నిద్రలేమి
గురక
నిద్రపోతున్నప్పుడు శ్వాస తీసుకోలేకపోవడం లేదా దీని కారణంగా తరచుగా మేల్కొనడం
అధిక పగటి నిద్ర
మానసిక స్థితి సరిగా లేకపోవడం
తలనొప్పి
నిద్ర లేచిన తర్వాత అలసిపోయినట్లు అనిపిస్తుంది.. 

ఇది కూడా చదవండి.. రిఫ్రిజిరేటర్ లో ఏమేం ఆహార పదార్థాలు ఉంచకూడదంటే..? 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..

Tags : research sleep-apnea researchers plant-based-diet
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com