సాక్షి లైఫ్ : ఆధునిక జీవన శైలిలో చాలా మార్పులు చోటు చేసుకుంటు న్నాయి. అటువంటి వాటిలో "రిఫ్రిజిరేటర్" గురించి ప్రధానంగా చెప్పుకోవాలి. ఇది ప్రతి ఒక్కరి రోజువారీజీవితంలో భాగమైంది. అయితే కొన్ని ఆహారపదార్థాలు "రిఫ్రిజిరేటర్" లో ఉంచడం వల్ల వాటిలో ఉండే పోషకాలు సైతం నశించి, అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతా యని పరిశోధకులు చెబుతున్నారు. అసలు "రిఫ్రిజిరేటర్" లో ఏమేమి ఆహార పదార్థాలు ఉంచకూడదో తెలుసుకుందాం..
ఫ్రెష్ గా ఉంటాయని భావిస్తున్నారా..?
షాపు నుంచి తెచ్చిన ఆహారపదార్థాలన్నీ"రిఫ్రిజిరేటర్" లో తోసేస్తున్నారా ? ఏ వస్తువు తీసుకొచ్చినా.. ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే.. ఫ్రెష్ గా ఉంటాయని భావిస్తున్నారా ? అయితే మీరు పొరబడ్డట్టే. ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన వస్తువులు ఫ్రిడ్జ్ లో పెట్టాలి. మరికొన్ని ఆహార పదార్థాలు ఏ మాత్రం ఫ్రిడ్జ్ లో పెట్టకూడదని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.
ఫ్రిడ్జ్ ఉంది కదా అని..
ఎందుకంటే.. వాటివల్ల హానికలిగే ప్రమాదం ఉంది. రిఫ్రిజిరేటర్ వాడకం ఏమాత్రం మంచిది కాదని రిఫ్రిజిరేటర్ లో పెట్టిన ఆహార పదార్థాలు పానీయాలు తాగడం వల్ల ఎన్నో అన్నారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని పలు రీసెర్చ్ సంస్థలు వెల్లడిస్తున్నాయి. ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది కదా అని ఏవి పడితే.. అవి అందులో ఉంచకూడదు.
దీనికి సంబంధించి శాస్త్రవేత్తలు కూడా హెచ్చరిస్తూనే ఉన్నారు. అయిన ప్పటికీ కొంత మంది వారి హెచ్చరికలను పట్టించు కోకుండా ప్రతి వస్తువును రిఫ్రిజిరేటర్ లో పెడుతున్నారు. ప్రతి ఒక్కరూ టమాటాలు ఫ్రిజ్లో పెడుతుంటారు కానీ అలా ఫ్రిజ్లో పెట్టడం వల్ల వాటి సహజత్వాన్ని కోల్పోతాయి. ఇక ఆరోగ్యానికి ఎంతో మంచి చేసే అరటిపండును సైతం ఫ్రిజ్ లో పెట్టవద్దని సూచిస్తున్నారు వైద్యనిపుణులు
ఇవి అస్సలు ఫ్రిజ్లో పెట్టకూడదు..
అవకాడో, వంకాయలు, పుచ్చకాయలు, తేనే, వెల్లుల్లి,చాక్లెట్లు కర్బుజా, తులసి, ఉల్లి, గుడ్లు, స్ట్రాబెర్రీలు, దోసకాయలు, కాఫీ పొడి, బ్రెడ్, పీనట్ బటర్, కచేప్, నారింజ లు లాంటివి ఫ్రిజ్లో పెట్టకూడదు అని చెబు తున్నారు ఇలాంటివి రిఫ్రిజిరేటర్ లో పెట్టడం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉంటాయి. ఉల్లిపాయలు ఫ్రిజ్‌లో మెత్తగా అవ్వడమే కాకుండా, బూజు పడుతాయి. ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్లే తేమ వస్తుంది. లోపల చల్లగా ఉండడంతో ఉల్లిగడ్డలకు ఫంగస్ వస్తుంది.
చాక్లెట్స్ కూడా..
చాక్లెట్స్ రిఫ్రిజ్ రేటర్ లో అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే చల్ల గాలి తగలడంవల్ల చాక్లెట్స్ ఒరిజినాలిటీని కోల్పో తాయి. అంతేకాదు చాక్లెట్స్ ను ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల లోపల ఉన్న ఆహార పదార్థాల వాసనలను గ్రహించి వాటి సహజత్వాన్ని కోల్పోతాయని పరిశోధకులు చెబుతున్నారు. తులసి ఆకులను తాజాగా ఉంచడానికి, ఫ్రిజ్‌లో ఉంచితే, అవి ఇతర ఆహారపదార్థాల వాసనలను గ్రహించి ఆకులు నల్లగా మారతాయి.
ఉడికించిన గుడ్డు..
ఉడికించిన గుడ్డును ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల గుడ్డులోపల చీలికలు ఏర్పడి బ్యాక్టీరియాకి కారణమయ్యే ప్రమాదం ఉంది. అంతేకాదు గుడ్డుపై భాగం రబ్బర్ లాగా మారుతుంది. అందుకే గుడ్డును ఉడికించిన తర్వాత ఫ్రిడ్జ్ లో ఉంచడం మంచిది కాదు. ఫ్రై చేసిన కూరలు, ఇతర ఆహారపదార్థాలు ఫ్రిడ్జ్ లో ఉంచి తినడం వల్ల బరువుపెరుగుతారు.
తిరిగి వేడి చేసి తినడం వల్ల..
ఫ్రైడ్ ఫుడ్స్ ను ఫ్రిడ్జ్ లో ఉంచి తిరిగి వేడి చేసి లేదా అలాగే తినడం వల్ల గుండె కు సంబంధించిన వ్యాధుల, ఊబకాయం, వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. పుచ్చకాయ , ఖర్భుజా, పొటాటో, కీరదోస, యాపిల్స్ వంటివాటిని నేరుగా ఫ్రిడ్జ్ లో ఉంచడంవల్ల ఆయా పదార్థాల మీద తేమ ఏర్పడి తర్వాత కొద్దిరోజులకు కుళ్లిపోతాయి. అంతేకాదు రుచి కూడా ఉండవు. కాబట్టి, నీటి శాతం ఎక్కువగా ఉండే ఆహారపదార్థాలను అస్సలు ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు.
ఇది కూడా చదవండి.. బొప్పాయి పండు తింటే వేడి చేస్తుందా..? ఎంతవరకు నిజం..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
Tags :Please subscribe for more updates...!
గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.
Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034
040 2325 6000
life@sakshi.com
© News. All Rights Reserved. by sakshi.com