స్లీప్ ఆప్నియాకు ఇదే సరైన పరిష్కారం..
సాక్షిలైఫ్: స్లీప్ ఆప్నియా అనేది నిద్ర సంబంధిత రుగ్మతలలో చాలా తీవ్రమైన సమస్య. దీని కారణంగా ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రజలు బాధపడుతున్నారు. ఇటీవల ఒక అధ్యయనం కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. ఐతే ఈ రుగ్మతను నిర్మూలించడంలో మొక్కల ఆధారిత ఆహారపదార్థాలు కీలక పాత్ర వహిస్తాయని ఓ పరిశోధనలో తేలింది.
ఇది కూడా చదవండి.. అధిక రక్తపోటు లక్షణాలు..?
మొక్కల ఆధారిత ఆహారం..
మొక్కల ఆధారిత ఆహారాన్ని అనుసరించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆరోగ్య నిపుణులు చాలాసార్లు చెప్పారు. మొక్కల ఆధారిత ఆహారం గుండె, మెదడును ఆరోగ్యంగా ఉంచడంలో చాలా సహాయపడుతుంది. అయితే ఇది స్లీప్ ఆప్నియా సమస్యను నివారించడంలో కూడా సహాయపడుతుందని మీకు తెలుసా..? అవును, ఈ విషయం తాజా అధ్యయనంలో వెల్లడైంది. స్లీప్ ఆప్నియా సమస్యను నివారించడంలో మొక్కల ఆధారిత ఆహారం ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకుందాం.
రీసెర్చ్‌లో..
ఈఆర్జే ఓపెన్ రీసెర్చ్‌లో ప్రచురించిన ఈ అధ్యయనంలో ఎక్కువ పండ్లు, కూరగాయలు, గింజలు, తృణధాన్యాలు కలిగిన ఆహారం తీసుకున్న వారిలో స్లీప్ ఆప్నియా ప్రమాదం గణనీయంగా తగ్గిస్తుంది. మొక్కల ఆధారిత ఆహారాన్ని అనుసరించే వ్యక్తులకు స్లీప్ అప్నియా వచ్చే ప్రమాదం 19 శాతం కంటే తక్కువగా ఉందని, ప్రాసెస్ చేసిన ధాన్యాలు, ఎక్కువ వేయించిన ఆహారాలు, ఎక్కువ ఉప్పు, చక్కెర ఉన్న ఆహారాలు వంటి అనారోగ్యకరమైన ఆహారాన్ని తీసుకునే వ్యక్తులలో ఈ సమస్య ఎక్కువగా వస్తుందని ఈ అధ్యయనం తేల్చింది. మొక్కల ఆధారిత ఆహారాన్ని తినే వారికి స్లీప్ ఆప్నియా వచ్చే ప్రమాదం 22 శాతం ఉంటుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు.
ఊబకాయం..
మొక్కల ఆధారిత ఆహారం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం చాలా తక్కువగా ఉండటమే దీనికి ఒక కారణమని పరిశోధకులు చెబుతున్నారు. అధిక బరువు , స్లీప్ ఆప్నియాకు ప్రధాన కారణమని, మొక్కల ఆధారిత ఆహారం చాలా ప్రయోజనకరంగా ఉంటుందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
ఇది కూడా చదవండి.. గొంతు బొంగురు పోవడం కూడా క్యేన్సర్ కు సంకేతమేనా..?
ఇది కూడా చదవండి.. ప్రపంచవ్యాప్తంగా హైపర్‌టెన్షన్ బాధితులు వీళ్లే..
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
