Rising Kidney Cancer Cases :పెరుగుతున్న మూత్రపిండాల క్యాన్సర్ కేసులు.. కారణాలు ఇవే.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : ప్రస్తుత తరంలో జీవనశైలి మార్పులు, ఆహారపు అలవాట్ల కారణంగా ప్రాణాంతక క్యాన్సర్ల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా నమోదవుతున్న క్యాన్సర్లలో 'కిడ్నీ క్యాన్సర్' 14వ స్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే, ఈ వ్యాధి పట్ల ప్రజల్లో అవగాహన లోపించడం, అనేక అపోహలు ప్రచారంలో ఉండటం వల్ల చాలామంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. కిడ్నీ క్యాన్సర్ ఈ వ్యాధికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వాస్తవాలు, అపోహల గురించిన ప్రత్యేక కథనం మీకోసం..

ఇది కూడా చదవండి.. వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే ఎలా మొదలైంది..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యప్రయోజనాలు పొందాలంటే సలాడ్ ను ఏ టైమ్ లో తినాలి..?

ఇది కూడా చదవండి..Stomach bloting problem : హెల్తీ ఫుడ్ తింటున్నా కడుపు ఉబ్బరంగా ఉందా..? ఈ విషయాలు తెలుసుకోండి..!

ఇది కూడా చదవండి..White Patches on Skin : చర్మంపై తెల్లటి మచ్చలా..?.. ఆధునిక వైద్యంతో ‘బొల్లి’కి సరైన పరిష్కారం..!

 

1. అపోహ..కిడ్నీ క్యాన్సర్ కేవలం వృద్ధులకే వస్తుందా..?

వాస్తవం..సాధారణంగా కిడ్నీ క్యాన్సర్ వృద్ధులలో ఎక్కువగా కనిపిస్తుందనే మాట నిజమే అయినప్పటికీ, ఇది యువతకు రాదని చెప్పలేం. మారుతున్న కాలంలో 50 ఏళ్లలోపు ఉన్న యువ జనాభాలో కూడా మూడింట ఒక వంతు మందికి ఈ క్యాన్సర్ వచ్చే ముప్పు ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

కారణాలు..ధూమపానం, మద్యపానం, చెడు జీవనశైలి, స్థూలకాయం, కుటుంబంలో క్యాన్సర్ చరిత్ర లేదా మునుపటి కిడ్నీ వ్యాధులు యువతలో ఈ ప్రమాదాన్ని పెంచుతున్నాయి.

2. అపోహ..మూత్రంలో రక్తం కనిపిస్తే కిడ్నీ క్యాన్సరేనా..?

వాస్తవం: మూత్ర విసర్జన సమయంలో రక్తం రావడం లేదా మూత్రం ముదురు ఎరుపు రంగులోకి మారడం అనేది ఖచ్చితంగా నిర్లక్ష్యం చేయకూడని హెచ్చరిక. అయితే, మూత్రంలో రక్తం పడిన ప్రతిసారీ అది క్యాన్సర్ కాకపోవచ్చు. కారణాలు..కిడ్నీలో రాళ్లు (Kidney Stones) ఉండటం, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (UTI) వంటి సాధారణ సమస్యల వల్ల కూడా ఇలా జరగవచ్చు. ఏదేమైనా, ఈ లక్షణం కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం సురక్షితం.

3. అపోహ..మహిళల్లోనే ఈ క్యాన్సర్ ప్రమాదం ఎక్కువ..?

వాస్తవం..కిడ్నీ క్యాన్సర్ ఏ వయసు వారికైనా, ఏ లింగం వారికైనా రావచ్చు. కానీ, గణాంకాల ప్రకారం మహిళలతో పోలిస్తే పురుషులలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం దాదాపు రెట్టింపు ఉంటుంది.కారణాలు.. పురుషులలో ధూమపానం అలవాటు ఎక్కువగా ఉండటం, పని ప్రదేశాలలో రసాయనాలు, విషపదార్థాల ప్రభావానికి గురికావడం వల్ల వారిలో ఈ ముప్పు ఎక్కువగా ఉంటోంది. అయితే, తరచుగా యూటీఐ (UTI) లేదా యోని ఇన్ఫెక్షన్లతో బాధపడే మహిళలు కూడా కిడ్నీ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి.

4. అపోహ.. మద్యం కేవలం కాలేయానికే హానికరం.. కిడ్నీలకు కాదు..!


వాస్తవం..మద్యపానం అనగానే కేవలం లివర్ మాత్రమే పాడవుతుందని చాలామంది భావిస్తారు. కానీ, మద్యం కిడ్నీల పనితీరును కూడా తీవ్రంగా దెబ్బతీస్తుంది. మద్యంతో పాటు ధూమపానం వల్ల కిడ్నీ క్యాన్సర్ వచ్చే ప్రమాదం రెట్టింపవుతుంది. గణాంకాలు.. పురుషులలో సుమారు 30 శాతం, మహిళలలో సుమారు 25 శాతం కిడ్నీ క్యాన్సర్ కేసులకు ఈ రెండు దురలవాట్లే ప్రధాన కారణమని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

ముందస్తు గుర్తింపే ప్రాణరక్ష..!

కిడ్నీ క్యాన్సర్‌ను మొదటి లేదా రెండో దశలోనే గుర్తిస్తే శస్త్రచికిత్స (Surgery), ఆధునిక థెరపీల ద్వారా పూర్తిగా నయం చేయవచ్చు. దురదృష్టవశాత్తు, ప్రారంభంలో పెద్దగా లక్షణాలు తెలియకపోవడం వల్ల చాలామంది వ్యాధి ముదిరిన తర్వాతే ఆసుపత్రికి వస్తున్నారు. కాబట్టి క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం ద్వారా ఈ మహమ్మారి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు.

ఇది కూడా చదవండి..Sippers and Tumblers : సిప్పర్లు, టంబ్లర్లలో నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదేనా..?

ఇది కూడా చదవండి..Low Birth Weight : తక్కువ బరువుతో పుడితే.. పెద్దయ్యాక పక్షవాతం ముప్పు..! తాజా అధ్యయనం..

 ఇది కూడా చదవండి.. వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు.. 

ఇది కూడా చదవండి.. చల్లని వాతావరణం వల్ల సైనస్ సమస్యలు పెరుగుతాయా..? 

ఇది కూడా చదవండి.. నోటి దుర్వాసనను తగ్గించే చిట్కాలు 


గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.