ఫుడ్ అలెర్జీలకు ప్రధాన కారణాలు..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : కొంతమందికి పడని ఆహార పదార్థాలు తింటే అలెర్జీ వస్తుంది. మరికొందరికి ఏవైతే ఇష్టం ఉండదో ఆయా ఆహారపదార్థాలకు సంబంధించిన వాసన చూసినా అనారోగ్యానికి గురవుతూ ఉంటారు. అసలు ఇలా జరగడానికి ప్రధాన కారణం ఏంటి..? అనేదానిపై శాస్త్రవేత్తలు పరిశోధన చేశారు. వీరి పరిశోధనలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. 

 సీఫుడ్‌ ఎలర్జీ ఉన్నవారు వాటి వాసన చూసినా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. ఒక వేళ ఆహారంగా తింటే ఎలా అనారోగ్యానికి గుర్వవ్వుతారో అలానే వాసన చూసి అవ్వుతారని చెప్పారు. అంతేకాదు ఈ విధంగా ఎందుకు జరుగుతుంది..? ఇలా అలెర్జీకి దారితీసేందుకు ప్రధాన కారణాలను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ మేరకు అలర్జీపై యేల్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడసిన్‌ వైద్య పరిశోధకులు అధ్యయనం నిర్వహించారు. ఇందుకు ప్రధాన కారణం రోగ నిరోధక వ్యవస్థే కీలకమని వెల్లడించారు. 

ఈ పరిశోధనకు సంబంధించిన ఫలితాలు నేచర్‌ జర్నల్‌లో ప్రచురిత మయ్యాయి. దీని ప్రకారం.. ఏదైన పడని ఆహారం లేదా ఫుడ్‌ ఎలర్జీ ఉన్నవారిలో సడెన్‌గా సంభవించే మార్పుల్లో రోగ నిరోధక వ్యవస్థే కీలకపాత్ర పోషిస్తుందని అధ్యయనంలో తేలింది. రోగనిరోధక వ్యవస్థే శరీరంలో మార్పులను నియంత్రిస్తుందని ఈ పరిశోధనలో వెల్లడయ్యింది.

రోగ నిరోధక వ్యవస్థ.. 

 ఈ మేరకు యూల్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ ప్రొఫెసర్ మాట్లాడుతూ..మన శరీరానికి హాని చేసే విషపదార్థాలకు వ్యతిరేకంగా మన మెదడు రక్షణాత్మక చర్యలను తీసుకునేలా ఈ రోగనిరోధక వ్యవస్థే ప్రేరేపిస్తుందని కనుగొన్నట్లు వివరించారు. ఈ రోగ నిరోధక వ్యవస్థ కమ్యూనికేషన్‌ లేకుండా మెదడు పర్యావరణంలో సంభావ్య ప్రమాదాల గురించి శరీరాన్ని హెచ్చరించ లేదని కూడా తెలిపారు.

అందుకోసం కొన్ని ఎలుకలపై అధ్యయనం నిర్వహించినట్లు వెల్లడించారు. కోడి గుడ్లలో ఉండే ఓవా అనే ప్రోటీన్‌కు అలెర్జీ ప్రతిచర్యలు ఉంటాయని గుర్తించారు. దీంతో పరిశోధకులు ఎలుకలకు ఈ ఓవాతో కలిపిన నీటిని ఇవ్వగా.. వాటిలో కొన్ని ఎలుకలు ఆ నీటిని నివారించేందుకు మొగ్గు చూపుతాయి. మరికొన్ని ఆ నీటిని ఇష్టపడటం గమనించారు. కొన్ని ఎలుకలు నెలల తరబడి గుడ్డు ఓవా నీటి పట్ల విముఖతను చూపించాయి. ఈ రోగనిరోధక వ్యవస్థలో వేరియబుల్స్‌ను మార్చడం ద్వారా ఎలుకల్లో ఈ విముఖత ప్రవర్తనను మార్చగలమా అనే దిశగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు.

ఇమ్యునోగ్లోబులిన్..  

అంటే రోగనిరోధక వ్యవస్థ ద్వారా ఉత్పత్తి చేసిన ఇమ్యునోగ్లోబులిన్ (ఐజీఈ) ప్రతిరోధకాలను నిరోధించినట్లయితే ఈ గుడ్డు ఓవా నీటికి అలెర్జీ ఉన్న ఎలుకలకు ఆ ప్రోటీన్ పట్ల ఉన్న విరక్తిని కోల్పోతాయని కనుగొన్నారు. ఇక్కడ ఒక కమ్యూనికేటర్‌ లేకుండా ఇదంతా జరగదని గుర్తించారు. 

ప్రమాదాలను నివారించేలా.. 

దీని అర్థం రోగనిరోధక వ్యవస్థను ఉత్పత్తి చేసే ఐజీఈ ప్రతిరోధకాలు మెదడుని మాస్ట్ కణాల విడుదలను ప్రేరేపించేలా కమ్యూనికేట్‌ చేస్తుందని. తద్వారా ఎలుకలు విరక్తి ప్రవర్తన లేదా ఇన్ఫెక్షన్‌ రావడం జరుగుతుందని చెప్పారు. అంతేగాదు జంతువులకు పర్యావరణంలో ఎదురయ్యే ప్రమాదాలను నివారించేలా రోగనిరోధక వ్యవస్థ ఎలా అభివృద్ధి చెందిందో ఈ పరిశోధన వివరించిందని సైంటిస్టులు చెబుతున్నారు. 

 గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి. 

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.