తేలు విషంతో రొమ్ము క్యాన్సర్‌కు చెక్.. సరికొత్త ఆశలు రేపుతున్న పరిశోధన..!
సాక్షి లైఫ్ : క్యాన్సర్ చికిత్సలో నిరంతరం కొత్త ఆవిష్కరణలు జరుగుతున్నాయి. తాజాగా, తేలు విషం రొమ్ము క్యాన్సర్ కణాలపై ప్రభావవంతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ పరిశోధనలు క్యాన్సర్ చికిత్సలో ఒక కొత్త మార్గాన్ని చూపించే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి..కిడ్నీ వ్యాధి లక్షణాలు: ఈ సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయవద్దు..
ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..
ఇది కూడా చదవండి..బ్యాడ్ ఫుడ్ కాంబినేషన్ : ఎలాంటి ఆహారాలను కలిపి తీసుకోకూడదు
ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?
పరిశోధన ఏమి చెబుతోంది..?
క్యూబాలోని సెంటర్ ఫర్ జెనెటిక్ ఇంజనీరింగ్ అండ్ బయోటెక్నాలజీ (CIGB) పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తేలు విషంలోని కొన్ని భాగాలు రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించడంలో మర్థవంతంగా పనిచేసినట్లు తేలింది. ముఖ్యంగా, రోపాలోబుస్ ప్యూరిసెప్స్ (Rhopalurus junceus) అనే నీలి తేలు (Blue Scorpion) విషంపై దృష్టి సారించారు.
తేలు విషం ఎలా పనిచేస్తుంది అసలు..?
తేలు విషంలో అనేక రకాల పెప్టైడ్‌లు, ప్రోటీన్లు ఉంటాయి. వీటిలో కొన్ని క్యాన్సర్ కణాలపై మాత్రమే లక్ష్యంగా పెట్టుకొని పనిచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని పరిశోధకులు గుర్తించారు. ఇవి ఆరోగ్యకరమైన కణాలకు ఎటువంటి హాని కలిగించకుండా, క్యాన్సర్ కణాలను గుర్తించి, వాటి పెరుగుదలను అడ్డుకుంటాయని, వాటిని నాశనం చేస్తాయని ప్రాథమిక అధ్యయనాలు సూచిస్తున్నాయి.
ఇది కూడా చదవండి..ఆహారంలో అవకాడోను ఎలా చేర్చుకుంటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు అంటే..?
ఇది కూడా చదవండి..వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా అవకాడోతో గుండెపోటుకు చెక్.. !
ఇది కూడా చదవండి..హెపటైటిస్ " ఏ" నివారించడంలో వ్యాక్సిన్ పాత్ర ఎంత..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి..
