టౌరిన్ స్థాయిలు పెరగడం వల్ల క్యాన్సర్ వస్తుందా..?  

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : టౌరిన్.. అనేది మన శరీరంలో సహజంగా ఉత్పత్తి అయ్యే ఒక ముఖ్యమైన అమైనో ఆమ్లం. మనం తీసుకునే మాంసం, చేపల వంటి ఆహార పదార్థాల్లోనూ ఇది లభిస్తుంది. అయితే, నేటి యువత తక్షణ శక్తి కోసం ఎక్కువగా తీసుకుంటున్న ఎనర్జీ డ్రింక్స్‌లో టౌరిన్ అధిక మొత్తంలో ఉంటుందని మీకు తెలుసా..? తాజాగా నేచర్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించడమే కాకుండా, కొన్ని ఆందోళనకరమైన విషయాలను కూడా తెలిపింది.

ఇది కూడా చదవండి..ఆస్తమా వచ్చిందంటే జీవితాంతం మందులు వాడాలా..?

ఇది కూడా చదవండి..శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగితే ఏమవుతుంది..?

ఇది కూడా చదవండి..వర్షాకాలంలో అజీర్ణ సమస్యతో బాధపడుతున్నారా..? ఈ ఆహారాలను తినకండి..

ఈ అధ్యయనం ప్రకారం, ఎనర్జీ డ్రింక్స్ ద్వారా శరీరంలో టౌరిన్ స్థాయిలు పెరగడం క్యాన్సర్ కణాల వృద్ధికి తోడ్పడే అవకాశం ఉంది. పరిశోధకులు ప్రత్యేకంగా రూపొందించిన జన్యువు (SLC6A6) కలిగిన ఎలుకలపై ఈ పరిశోధనలు నిర్వహించారు. ఈ ఎలుకలకు మానవ లుకేమియా (రక్త క్యాన్సర్) కణాలను ఎక్కించారు. ఆ తర్వాత, ఈ క్యాన్సర్ కణాలకు టౌరిన్ ఎలా చేరుకుంటుందో శాస్త్రవేత్తలు నిశితంగా పరిశీలించారు.

రక్త క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉందా..?

పరిశోధనలో ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. ఎముక మజ్జలోని ఆరోగ్యకరమైన కణాలు కూడా టౌరిన్‌ను ఉత్పత్తి చేస్తాయని, దీనిని SLC6A6 జన్యువు ద్వారా క్యాన్సర్ కణాలకు అందిస్తున్నాయని తేలింది. ఈ ప్రక్రియ రక్త క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా, ఎనర్జీ డ్రింక్స్‌లో టౌరిన్ అధిక స్థాయిలో ఉండటం వల్ల లుకేమియా రోగులకు ఇది మరింత హాని కలిగించవచ్చని వారు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి, ఎనర్జీ డ్రింక్స్ తాగే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించడం చాలా అవసరం.

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.