ఎనర్జీ డ్రింక్స్ కారణంగా ప్రాణాంతక వ్యాధుల ప్రమాదం.. తాజా అధ్యయనంలో వెల్లడి.. 

షేర్ చేయండి:

సాక్షి లైఫ్ : నేటితరం యువకులు ఎనర్జీ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడతారు కానీ వాటిలో ఉండే టౌరిన్ అనే పదార్ధం రక్త క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని ఒక కొత్త అధ్యయనం కనుగొంది. పరిశోధకులు ఎలుకలపై పరిశోధన నిర్వహించారు. ఇందులో ఈ తీవ్రమైన ప్రాణాంతకవ్యాధుల ప్రమాదం పెరుగుతుందని వెల్లడైంది. కాబట్టి, వీటిని తాగడం మానుకోవాలి.

ఇది కూడా చదవండి..వాక్సిన్ గురించి వాస్తవాలు- అవాస్తవాలు..

ఇది కూడా చదవండి..తల్లిపాలే శిశువు భవిష్యత్తుకు, ఆరోగ్యపరిరక్షణకు పునాది..

ఇది కూడా చదవండి..ఆహారంలోని పురుగుమందులు దీర్ఘకాలంలో ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి..?

 

నేటి యువత మార్కెట్లో లభించే ఎనర్జీ డ్రింక్స్ కు ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇంట్లో తయారుచేసిన జ్యూస్ తాగడం కంటే మార్కెట్ నుంచి ఎక్కువ ధరలకు ఎనర్జీ డ్రింక్స్ కొని తాగడానికే వారు ఇష్టపడుతున్నారు. ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల తక్షణ శక్తి లభిస్తుందని రాసినప్పటికీ, ఇది ఆరోగ్యానికి హానికరమని చెబుతున్నారు పరిశోధకులు. దీనివల్ల శరీర బరువు పెరిగే అవకాశం ఉండడమేకాకుండా కొన్ని ప్రమాదకరమైన వ్యాధులు కూడా సంభవిస్తాయని వారు అంటున్నారు.

ఈ రోజుల్లో, మార్కెట్లో వివిధ రకాల అధిక చక్కెర కలిగిన ఎనర్జీ డ్రింక్స్ అందుబాటులో ఉన్నాయి. ఇవి శరీరాన్ని వెంటనే యాక్టివ్ మోడ్‌లోకి తీసుకువచ్చినప్పటికీ, దీర్ఘకాలంలో శరీరానికి హాని కలిగిస్తాయి. ఎనర్జీ డ్రింక్స్ లో లభించే 'టౌరిన్' అనే పదార్ధం బ్లడ్ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని ఇటీవలి అధ్యయనంలో వెల్లడైంది.

 

ఇది కూడా చదవండి..మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరిచే 5 రోజువారీ అలవాట్లు.. 

ఇది కూడా చదవండి..20 ఏళ్లలోపు వారికే గుండెపోటు ఎక్కువగా రావడానికి ప్రధాన కారణాలు.. 

ఇది కూడా చదవండి..బాడీ బిల్డింగ్ కోసం ఎక్కువగా ఎక్సర్సైజ్ చేస్తున్నారా..? 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.