మైగ్రేన్ కు గుండెపోటుకు ఏంటి లింక్..?  

షేర్ చేయండి:
మైగ్రేన్ కు గుండెపోటుకు ఏంటి లింక్..?  

సాక్షి లైఫ్ : మైగ్రేన్‌ పెయిన్ చాలా రోజుల నుంచి ఉన్నట్లయితే, దానిని ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దని వైద్య నిపుణులు చెబుతున్నారు. మైగ్రేన్‌ను నిర్లక్ష్యం చేయడం వల్ల ఒక్కోసారి హార్ట్ అటాక్, హార్ట్ స్ట్రోక్ వంటి అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అందుకే ఈ సమస్యను సకాలంలో గుర్తించి చికిత్స తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.   

 లక్షణాలు.. 

మైగ్రేన్ తలనొప్పి సాధారణ తలనొప్పి కంటే చాలా తీవ్రంగా ఉంటుంది.  దీనికి తీవ్రమైన శ్రద్ధ కూడా అవసరం ఎందుకంటే కొన్ని పరిస్థితులలో ఇది సైకోసోమాటిక్ డిజార్డర్ వల్ల వచ్చే సమస్యగా కూడా మారవచ్చని వైద్యులు చెబుతున్నారు. మైగ్రేన్ అనేది నాడీ సంబంధిత సమస్య. దీని కారణంగా తలకు ఒక వైపు తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఈ నొప్పి కారణంగా గుండె స్పందన వేగవంతమవుతుంది. వికారంగా ఉండడం, వాంతులు అవ్వడంతోపాటు ఎలాంటి సౌండ్ వినలేరు, ఎక్కువ సేపు లైటింగ్ వైపు కూడా చూడలేరు.

ఇది కూడా చదవండి.. ఎలాంటివాళ్లకు లివర్ దెబ్బతినే అవకాశం ఉంటుందంటే..?  

మైగ్రేన్ వల్ల వచ్చే సమస్యలు.. 

ప్రపంచవ్యాప్తంగా స్ట్రోక్ మరణానికి రెండవ అత్యంత సాధారణ కారణం. భారతదేశంలో ప్రతి సంవత్సరం 1.85 లక్షల మందికి పైగా మైగ్రేన్ బారీన పడుతున్నారు. మైగ్రేన్ ఉన్నవారికి స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. మైగ్రేన్, ఇస్కీమిక్ స్ట్రోక్ మధ్య సంబంధం గురించి అనేక అధ్యయనాలలో ఇవి రెండూ రక్తనాళాల సరఫరాకు సంబంధించిన సమస్యలని తేలింది. 
 
మైగ్రేన్ మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్, స్ట్రోక్ , కార్డియోవాస్కులర్ ప్రాణాపాయ ప్రమాదాన్ని కూడా పెంచుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. గుండె జబ్బులు - పక్షవాతం వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మైగ్రేన్‌లతో బాధపడేవారికి గుండె సంబంధ సమస్యలు వచ్చే ప్రమాదం రెండింతలు ఉంటుందని మరొక అధ్యయనం సూచిస్తుంది. 

జర్నల్ ఆఫ్ న్యూరాలజీలో ప్రచురించిన ఒక అధ్యయనంలో, మైగ్రేన్‌కు సకాలంలో చికిత్స చేయకపోతే, అది ఇస్కీమిక్ స్ట్రోక్‌కు దారితీస్తుందని, ఇది ప్రాణాంతకమైన దుష్ప్రభావాలను కలిగిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి మైగ్రేన్ సమస్యతో బాధపడుతున్నవారు తగిన చికిత్స కోసం ఖచ్చితంగా ఆరోగ్య నిపుణులను సంప్రదించాలని  ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి.. ఇన్ ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ పురుషుల్లో ఎందుకు పెరుగుతున్నాయంటే..?  

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.