శాస్త్రవేత్తలు కొన్ని ప్రయోగాలు ఎలుకలపైనే ఎందుకు చేస్తారు..?
సాక్షి లైఫ్ : ఏదైనా ఒక వాక్సిన్ గానీ ఔషధం గానీ తయారుచేసి ముందుగా వాటిని ఎలుకలపై ప్రయోగిస్తారు. శాస్త్రవేత్తలు ఇలాంటి ప్రయోగాలకు ఎలుకలనే ఎందుకు ఎంచుకుంటారు..? ఈ ప్రయోగాల ఫలితాలు మనుషుల ఎలాంటి ప్రభావం చూపిస్తాయి..? ఏదైనా కొత్త ఔషధం మార్కెట్ లోకి తీసుకువచ్చే ముందు అనేక ప్రయోగాలు జరుపుతారు పరిశోధకులు. వాటిని మరింత జాగ్రత్తగా పరిశీలించి, క్లినికల్ ప్రయోగాలు నిర్వహించాల్సి ఉంటుంది.
శాస్త్రవేత్తలు ఎలుకలపై, ముఖ్యంగా మందులపై కూడా ప్రయోగాలు చేస్తారని మీకు తెలుసు. మార్కెట్‌లోని ఏదైనా కొత్త ఔషధం లేదా వ్యాక్సిన్ మొదటి ట్రయల్ ఎలుకలపై మాత్రమే చేస్తారు. తద్వారా దాని ప్రయోజనాలు, దుష్ప్రభావాలు తెలుసుకుంటారు పరిశోధకులు. ఎలుకలపై చేసిన ప్రయోగం విజయవంతమైనప్పుడు మాత్రమే సాధారణ ప్రజలు దానిని ఉపయోగించడానికి అనుమతిస్తారు శాస్త్రవేత్తలు.
ఇది కూడా చదవండి..రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించే సూపర్‌ఫుడ్స్..?
ఇది కూడా చదవండి..ఆడవాళ్ళలో కంటి సంబంధిత సమస్యలకు ప్రధాన కారణాలు..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యకరమైన గుండె కోసం ఎలాంటి జీవనశైలి మార్పులు అవసరం అంటే..?
ఇది కూడా చదవండి..మీ లివర్ పాడైతే శరీరంలో కనిపించే సింటమ్స్ ఇవే..
ఎలుకలు మానవులకు వచ్చిన మాదిరిగానే అనేక వ్యాధులు సోకుతాయి. ఒకే రకమైన శారీర భాగాలను కలిగి ఉంటాయి. మాంసకృత్తుల కోసం కోడ్ చేసే 95శాతం జన్యువులు మనుషులు, ఎలుకలలో ఒకేలా ఉంటాయి. పరిశోధకులు ఎలుకలను మానవులతో పోల్చినప్పుడు ఇద్దరి సారూప్యతలు చాలా దగ్గరగా ఉన్నాయి.
ఎలుకల జీవితకాలం 2 నుంచి7 సంవత్సరాలు. కాబట్టి రోగాలకు కారణాలు తెలుసుకోవడానికి, అధ్యయనం చేయడానికి వ్యాధుల పురోగతిని విశ్లేషించడానికి ఎలుకలనే ఎంచుకుంటారు శాస్త్రవేత్తలు. ఎలుకలు గుంపులుగా జీవించడానికి ఇష్టపడతాయి. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. తమ గుంపులోని ఎలుక ఏదైనా జబ్బుపడినా, గాయపడినా వాటి సంరక్షణ కూడా తీసుకుంటాయి.
ఎలుకలు స్విమ్మింగ్‌లో కూడా ఎక్స్ పర్ట్స్. ఇవి లోతైన నీటిలో కూడా సులభంగా ఈదుతాయి. పిల్లిలాగా, ఎలుక శరీరం కూడా చాలా సరళంగా ఉంటుంది. 50 అడుగుల ఎత్తు నుంచి పడిపోయినా వాటికి ఎలాంటి గాయాలు కావు. ఎలుకల ముందు దంతాలు చాలా వేగంగా పెరుగుతాయి. దీనివల్ల గోడలు, ఇటుకలు, సిమెంటు వంటి వాటిని పళ్లతో కోరుకుతాయి.
ఎలుకలు వస్తువులను కొరుకకపోతే, వాటి దంతాలు సంవత్సరంలో 1 నుంచి 2 అంగుళాలు పెరుగుతాయి. ఎలుకలు జ్ఞాపకశక్తిని కలిగి ఉంటాయి. ఒక్కసారి వెళ్లిన మార్గాన్ని చూస్తే , ఆ తర్వాత దాన్ని మర్చిపోవు. ఎలుకలు మానవులకు 30 కంటే ఎక్కువ వ్యాధులను కలిగిస్తాయి. ఈ వ్యాధులలో ప్లేగు అత్యంత ప్రాణాంతకమైనది.
ఇది కూడా చదవండి..డయాబిటిస్ రిస్క్ ఎలాంటివాళ్లకు ఎక్కువ..?
ఇది కూడా చదవండి..హెపటైటిస్ బి, సి ప్రాణాంతకమా..?
ఇది కూడా చదవండి..నూతన అధ్యయనం : పసుపులో విషపూరిత పదార్థాలు..
ఇది కూడా చదవండి..అవిసె గింజలతో ఎలాంటి దుష్ప్రభావాలున్నాయంటే..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
