ఆరోగ్యానికి పాలు లేని "టీ" నే మంచిది..
సాక్షి లైఫ్ : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) టీ తాగడానికి సంబంధించి మార్గదర్శకాలను జారీ చేసిన విషయం తెలిసిందే. భోజనం తిన్న తర్వాత టీ లేదా కాఫీ ఎందుకు తాగకూడదో ఐసీఎంఆర్ వివరించింది. టీ లేదా కాఫీ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇష్టపడే అత్యంత ప్రజాదరణ పొందిన పానీయాలు.
ఇది కూడా చదవండి.. మహిళలకు రిగ్యులర్ గా ఎలాంటి హెల్త్ చెకప్స్ అవసరం..?
భారతదేశంలో ప్రజలు టీ లేదా కాఫీ తాగడానికి ఆసక్తి చూపుతారు. కాఫీ, టీలు భోజనానికి గంట ముందు, భోజనానికి గంట తర్వాత ఇవి అధిక మొత్తంలో తీసుకోవడంవల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుందని ఐసీఎంఆర్ వెల్లడించింది.
ఐసీఎంఆర్ కొత్త మార్గదర్శకాలలో పాలతో టీ తాగే బదులు, పాలు లేని టీ తాగడం మేలని చెప్పింది. గ్రీన్ లేదా బ్లాక్ టీ మరింత ప్రయోజనకరంగా ఉంటుందని కూడా ఐసీఎంఆర్ పేర్కొంది. నిజానికి పాలు కలపనిటీలో థియోబ్రోమిన్ , థియోఫిలిన్ ఉంటాయి. ఇవి ధమనులను సడలించడం,తద్వారా రక్త ప్రసరణను ప్రోత్సహిస్తాయి.
అవి ఫ్లేవనాయిడ్లు, ఇతర యాంటీఆక్సిడెంట్ పాలీఫెనాల్స్‌ను కూడా కలిగి ఉంటాయి. ఇవి కరోనరీ హార్ట్ డిసీజ్ , కోలన్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అయితే, టీలో పాలు కలపకపోతే లేదా తక్కువ పరిమాణం లో పాలు కలిపినప్పుడు మాత్రమే ఈ ప్రయోజనాలన్నీ పొందవచ్చని ఐసీఎంఆర్ తెలిపింది.
ఇది కూడా చదవండి.. బరువు తగ్గించే నల్ల ఉప్పు..
ఇది కూడా చదవండి.. ఒక వారంలో ఎన్ని గంటలు వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి మంచిది..?
గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
