హెయిర్ ఫాల్ కు సరైన ఇంటి చిట్కాలు..
సాక్షి లైఫ్ : ఇంట్లో అందుబాటులో ఉండే సాధారణ పదార్థాలు, చిట్కాలు ఉపయోగించి చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు. ఇవన్నీ పాటించడానికి, ఆరోగ్య నిపుణుల ప్రామాణిక సలహాలను పాటించడం చాలా అవసరం. ఇంటి లభించే పదార్థాలతో సులభంగా అనుసరించగల కొన్ని ఆరోగ్యకరమైన చిట్కాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఇది కూడా చదవండి..మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో యువతులకు కీలక మార్గదర్శకాలు..
ఇది కూడా చదవండి..పగటి భోజనానికి, రాత్రి భోజనానికి మధ్య ఎన్నిగంటలు గంటలు విరామం ఉండాలి..?
ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్‌ను తొలగించే ఐదు మార్నింగ్ హెల్తీ హ్యాబిట్స్..
జుట్టు రాలు సమస్యకు సరైన పరిష్కారం..
-ఇరవై తమలపాకులని తీసుకుని శుభ్రంగా కడిగి పేస్టుచేయాలి.
-ఈ పేస్టులో టీస్పూను నెయ్యి వేసి కలపాలి.
-ఆ మిశ్రమాన్ని మాడు నుంచి వెంట్రుకల చివర్ల వరకు పట్టించాలి.
గంట తరువాత నీటితో కడిగేయాలి.
-ఇలా వారానికి ఒకసారి ఈ మాస్క్ వేసుకోవడం వల్ల తమలపాకులోని పోషకాలు అంది జుట్టు మరింత బలంగా దట్టంగా పెరుగుతుంది.
-జుట్టురాలే సమస్య కూడా తగ్గుముఖం పడుతుంది.
-అలాగే తమలపాకు పేస్ట్‌లో కొద్దిగా కొబ్బరి నూనె, ఆముదం కలిపి జుట్టు కుదుళ్లకు మసాజ్ చేసితే జుట్టు ఒత్తుగా బలంగా పెరుగుతుంది.
-ఈ విధంగా వారానికి ఒకసారి లేదా నెలకు రెండు మూడు సార్లు చొప్పున చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.
ఇది కూడా చదవండి..కిడ్నీడ్యామేజ్ అయ్యే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి..?
ఇది కూడా చదవండి..ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి ఎన్నిగుడ్లు తినాలి..?
గమనిక : ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.
