మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్ విషయంలో యువతులకు కీలక మార్గదర్శకాలు.. 

సాక్షి లైఫ్: భారతీయ యువతుల్లో మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్ (ఎంబీసీ) కేసులు పెరుగుతున్నాయి. ఈ రకమైన క్యాన్సర్ కేసులు యువతుల్లో 8.5శాతం నమోదవుతున్నాయని నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ పరిశోధన వెల్లడిస్తోంది. ఈ పరిస్థితిలో చికిత్స, వ్యక్తిగతమైన బాధ్యతలు, వృత్తిపరమైన బాధ్యతలు సమతుల్యంగా నిర్వహించడం చాలా కష్టంగా మారుతోంది. అయితే ఇటీవల అందుబాటులోకి వచ్చిన చికిత్సా విధానాలు బాధితులకు సమర్థవంతంగా సహాయపడతాయని డా. నిఖిల్ ఎస్ ఘద్యల్‌పాటిల్ మెడికల్ ఆంకాలజస్ట్ చెబుతున్నారు. భారత దేశంలోని యువతులలో పెరుగుతున్న మెటాస్టాటిక్ రొమ్ము క్యాన్సర్ కేసులు చికిత్స, సంరక్షణ విధానాల ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నాయి. 

ఇది కూడా చదవండి..పగటి భోజనానికి, రాత్రి భోజనానికి మధ్య ఎన్నిగంటలు గంటలు విరామం ఉండాలి..?

ఇది కూడా చదవండి..కొలెస్ట్రాల్‌ను తొలగించే ఐదు మార్నింగ్ హెల్తీ హ్యాబిట్స్..

ఇది కూడా చదవండి..కిడ్నీడ్యామేజ్ అయ్యే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి..?

ఇది కూడా చదవండి..ఆరోగ్యంగా ఉండాలంటే రోజుకి ఎన్నిగుడ్లు తినాలి..?

ప్రభావవంతమైన సంరక్షణకు కణితి మాత్రమే కాకుండా రోగి వ్యక్తిగత లక్ష్యాలు, విలువలను కూడా పరిగణించాల్సిన ప్రక్రియ అవసరం. వారి జీవితాన్ని పొడిగించడానికి అధునాతన చికిత్సలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదా లక్షణాల నిర్వహణ ద్వారా జీవననాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి పెట్టడం వంటి సమాచార నిర్ణయం తీసుకోవడాన్ని శక్తివంతం చేయడానికి రోగులు- వైద్యుల మధ్య సంభాషణ చాలా అవసరమని అయన అన్నారు. రోగులకు మార్గనిర్దేశం చేయడం, వారి ప్రయాణంలోని ప్రతి దశలో వారికి మద్దతు అందించడం వైద్యుల బాధ్యత అని ఆయన వెల్లడిస్తున్నారు.  

అవగాహన..  

రొమ్ము క్యాన్సర్ ప్రతి రోగి కోసం ప్రత్యేకంగా ఉంటుంది. కణితి జీవశాస్త్రం తెలుసుకోవడం, హార్మోన్ రిసెప్టర్-పాజిటివ్, HER2-పాజిటివ్ లేదా ట్రిపుల్-నెగటివ్ వంటి వివరాలను అర్థం చేసుకోవడం చికిత్సకు కీలకం. 

వ్యక్తిగత లక్ష్యాలు.. 

చికిత్స ఎంపికలు రోగి వ్యక్తిగత లక్ష్యాలు, విలువలు, జీవనశైలి కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటూ ఉండాలి. యువతులకు HER2-లక్ష్యంగా చికిత్సలు, హార్మోన్ థెరపీలు మంచి ఫలితాలు అందిస్తున్నాయి.

జీవన నాణ్యతను మెరుగుపరచడం.. 

మెటాస్టాటిక్ రొమ్ము క్యాన్సర్ చికిత్స తీసుకునే యువతులకు జీవన నాణ్యత చాలా ముఖ్యం. శారీరక , మానసిక సవాళ్లను అధిగమించేందుకు, సపోర్ట్ గ్రూపులు,  కౌన్సెలింగ్ ఉపయోగపడతాయి.

అధునాతన చికిత్సలు.. 

ప్రస్తుత చికిత్సలకు పాక్షికంగా స్పందించే రోగుల కోసం, కొత్త చికిత్సలు , క్లినికల్ ట్రయల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఎంపికలు రోగులకు కొత్త ఆశను పంచుతాయి.

చికిత్సలో నిర్ణయం తీసుకోవడం.. 

వైద్యులు, రోగులు వారి సంరక్షకుల మధ్య చర్చలు, పారదర్శకమైన నిర్ణయాలు తీసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ విధానం, రోగులకు వారి ప్రాధాన్యాలను ప్రతిబింబించేలా చికిత్సా ఎంపికలు నిర్ధారించడానికి సహాయపడుతుంది. మెటాస్టాటిక్ రొమ్ము క్యాన్సర్ చికిత్సలో వ్యక్తిగత అవగాహన, సంపూర్ణ మద్దతు యువ భారతీయ మహిళలకు బలం, ఆశను అందించి, వారి భవిష్యత్తుకు భరోసా ఇస్తుంది.

ఇది కూడా చదవండి..స్ట్రోక్ కు ప్రధాన కారణాలు..? నివారణ ఎలా..? 

ఇది కూడా చదవండి..కిడ్నీడ్యామేజ్ అయ్యే ముందు కనిపించే 5 లక్షణాలు.. 

 

గమనిక: ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి.. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం వైద్య నిపుణులను సంప్రదించండి.

Tags : women-health tensions stress health-care-tips women-health-problems breast-cancer women-health-care-tips lack-of-awareness awareness mother-breast-milk metastatic-liver-cancer-treatment metastatic-breast-cancer breast-cancer-treatment breast-cancer-support metastatic-cancer-management
Newsletter

Please subscribe for more updates...!

గమనిక: సాక్షి లైఫ్ వెబ్ సైట్ ద్వారా అందించే ఆర్టికల్స్ ను డాక్టర్ల సలహాలను కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. ఈ సమాచారం ఆధారంగా ఆరోగ్య సమస్యలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవద్దు. అందుకోసం తప్పనిసరిగా వైద్య నిపుణులను సంప్రదించండి.

Get In Touch

Door No 6-3-249/1, Sakshi Towers, Beside Care Hospital, Near City Center, Road No 1, Banjara Hills-500034

040 2325 6000

life@sakshi.com

Follow Us

© News. All Rights Reserved. by sakshi.com